Share News

YSRCP: తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాజీనామా.. ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్..

ABN , Publish Date - Feb 24 , 2025 | 01:09 PM

కాకినాడ: తుని మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ సుధారాణి తన పదవికి రాజీనామా చేయడం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం తన ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సుధారాణి.

YSRCP: తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాజీనామా.. ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్..
Tuni Municipality Chairperson Sudharani

కాకినాడ: తుని మున్సిపాలిటీ(Tuni Municipality) ఛైర్‌పర్సన్ సుధారాణి (Chairperson Sudharani) తన పదవికి రాజీనామా చేయడం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం తన ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సుధారాణి. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.."నా ఇంటిపై దాడి చేసి నాపై ఏ-1గా కేసు నమోదు చేశారు. 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తునిలో రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడైనా మహిళపై ఏ-1గా కేసు పెట్టారా?. బీసీ మహిళ.. ఎమ్మెల్యేగా ఉండి మరొక బీసీ మున్సిపల్ ఛైర్మన్ మీద కేసు పెట్టారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే త్వరలో జరగనున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికతో సుధారాణికి భయం పట్టుకుందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీ వైపు మెుగ్గు చూపుతుండడంతోనే సుధారాణి రాజీనామా చేస్తున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.


వైస్ ఛైర్మన్ ఎన్నిక రగడ..

కాగా, తుని మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పదవి ఎన్నిక ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలు ఏర్పడ్డాయి. వైస్ ఛైర్మన్ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడగా.. నాలుగోసారీ కోరం లేకపోవడంతో ఫిబ్రవరి 18న రద్దయ్యింది. తదుపరి ఎన్నిక ఎప్పుడనేది ఎన్నికల కమిషన్‌ను నిర్ణయిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. వైస్ చైర్మన్ ఎన్నికకు టీడీపీ కౌన్సిలర్లు ప్రతిసారీ హాజరయ్యారు. అయితే ఓటమి భయంతో వైసీపీ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలే రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి.


టీడీపీ గెలుస్తుందనే భయంతోనే 17 మంది వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించారనే ప్రచారం జోరుగా సాగింది. ఇదంతా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కనుసన్నుల్లోనే జరిగిందనే విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వైస్ ఛైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికను రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా ఛైర్‌పర్సన్ సుధారాణి రాజీనామాతో స్థానికంగా వైసీపీకి భారీ షాకే తగినట్లు అయ్యింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ప్రతిపక్ష హోదా.. జగన్‌‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు

Avinash: దమ్ముంటే ఆ నాలుగు స్థానాల్లో ఉపఎన్నికకు రండి..

Updated Date - Feb 24 , 2025 | 01:23 PM