Share News

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:08 AM

ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక రాజీవ్‌నగర్‌లో రూ.1.08 కోట్లతో నిర్మించిన ప్రధాన రహదారి, డ్రైనేజీలు, మరో 8 సీసీ రోడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. రిబ్బన్‌ కట్‌ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.

గ్రామాల అభివృద్ధే ధ్యేయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోరంట్ల

  • ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి

  • రాజీవ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ధవళేశ్వరం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక రాజీవ్‌నగర్‌లో రూ.1.08 కోట్లతో నిర్మించిన ప్రధాన రహదారి, డ్రైనేజీలు, మరో 8 సీసీ రోడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. రిబ్బన్‌ కట్‌ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా నిర్వహించిన సభలో గోరంట్ల మాట్లాడుతూ ఈ ప్రాంతంలో త్వరలోనే వ్యవసాయ కళాశాల రాబోతుందని, స్థానికుల సౌకర్యం కోసం పాఠశాలలతో పాటు రైతు బజార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. టిడ్కో గృహ సముదాయంలో అనర్హులను గుర్తించి అర్హులకు కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్లను రాజీవ్‌నగర్‌ వాసులు ఘనంగా సత్కరించారు. అనంతరం హైవే నుంచి సాయిబాబా గుడి వరకు నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఎర్ర కొండపై డ్రైన్ల నిర్మాణం కోసం పలువురు వినతిపత్రం అందజేయగా డ్రైన్ల నిర్మాణానికి, వడ్డెర్లకు కమ్యూ నిటీ హాల్‌ నిర్మాణానికి నిధులుమంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీడీవో శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఆయా కార్యక్రమాల్లో పంచాయతీ కార్య దర్శి జి.వెంకట్రావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు పం డూరి అప్పారావు, మండలాధ్యక్షుడు ఎం.శివసత్యప్రసాద్‌, వాసిరెడ్డి రాంబాబు, మార్ని వాసుదేవరావు, ఆళ్ల ఆనందరావు, పిన్నంటి ఏకబాబు, నీలి కోటేశ్వరరావు, యడ్ల మహేష్‌, బీరా ప్రకాష్‌, షేక్‌ అసీనా, ఒం టెద్దు స్వామి, పన్నాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

  • వ్యవసాయ యంత్ర పరికరాల అందజేత

రాజమహేంద్రవరం రూరల్‌, ఏప్రిల్‌ 15(ఆం ధ్రజ్యోతి): మండలంలోని రాజవోలు గ్రామంలో సబ్సిడీతో కూడిన పలు వ్యవసాయ యంత్ర పరి కరాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గత పభ్రుత్వం వ్యవ సాయ యాంత్రీకరణకు ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని, ధాన్యం కొనుగోళ్ల తరువాత రైతులకు 3నుంచి 4నెలల వరకు సొమ్ము జమ చేసేదికాదని, ప్రస్తుత ప్రభుత్వం ధాన్యం అమ్మి న 24గంటల్లోపే రైతుల ఖాతాకు సొమ్ములు జమ చేస్తోందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు మాట్లాడుతూ జిల్లాలో రూ.3.92 కోట్ల సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాల ను రైతులకు అందజేస్తోందన్నారు. రైతులంతా భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్య క్రమంలో మార్ని వాసుదేవరావు, మత్యేటి శివస త్యప్రసాద్‌, గాలి వెంకటేశ్వరరావు, నిమ్మలపూడి రామకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాపరావు, డీఎంపీడీ వో సునీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఏడీఏ శ్రీనివాసరెడ్డి, ఏవో భీమరాజు, ఏఈవోలు పాల్గొన్నారు. అలాగే రాజవోలు జడ్పీ హైస్కూల్లో గోరంట్ల శాంతారాం జ్ఞాపకార్ధం జీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్యర్యంలో నిర్మించిన బాస్కెట్‌ బాల్‌ కోర్టును టీడీపీ హెల్త్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్‌ కిరణ్‌తో కలిసి ఎమ్మెల్యే గోరంట్ల ప్రారం భించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 01:08 AM