అధ్యాపకుల సంఘం ఎన్నికలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:49 PM
నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల అసోసియేషన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.

నంద్యాల ఎడ్యుకేషన, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల అసోసియేషన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్నికల అధికారి డాక్టర్ ఎం.రమేష్, అబ్జర్వర్ మురళీమోహనల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అధ్యాపకులకు గాను 50 మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు ప్యాన ల్స్ మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో 15 ఓట్ల తేడాతో నంద్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షులుగా విజయం సాధించారు. ఉపాఽధ్యక్షుడిగా వెంకటప్రసాద్, కార్యదర్శిగా దివాకర్, జాయింట్ సెక్రటరీగా దర్షావలి, ట్రెజరర్‌గా శ్రీనివాసరెడ్డి, మహిళా కార్యదర్శిగా భాగ్యమ్మ, స్టేట్ కౌన్సిలర్స్‌గా పాపోడు, పెద్దయ్యలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తమ ఎన్నికలకు సహకరించిన డీఐఈవో సునీతకు నూతనంగా ఎన్నికైన అసోసియేషన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు