ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anagani: రెవెన్యూ సదస్సులో అధికారులపై మంత్రి అనగాని ఫైర్

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:05 PM

Anagani Satyaprasad: రెవెన్యూ సదస్సులో అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22ఏ సమస్యకే ఇంత వరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఫైర్ అయ్యారు.

AP Minister Anagani Satyaprasad

మంగళగిరి, జనవరి 3: సీసీఎల్ఏ కార్యాలయంలో రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyanprasad) అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమన్నారు. కానీ రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22ఏ సమస్యకే ఇంత వరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కబడిగా పని చేయడం మానుకోవాలని హితవుపలికారు. పరిష్కరించగలిన అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని.. దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. పరిష్కరించిన అర్జీలపై ప్రజలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై జిల్లా స్థాయిలోనూ అర్జీదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు.


ఈ శాఖకు సర్జరీ అవసరం: సిసోడియా

రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి చాలా ఉందని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అన్నారు. రెవెన్యూ శాఖకి ప్రస్తుతం సర్జరీ అవసరమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రేడ్ మిల్‌పైన పరిగెడితున్నట్లు ఉందని... అక్కడే ఉంటున్నారని...గమ్యం చేరడం లేదని సిసోడియా విమర్శించారు. ఈ సమావేశంలో ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ రామరాజు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోదియా, సీసీఎల్ఎ జయలక్ష్మీ పాల్గొన్నారు.

TG News: గర్ల్స్ హాస్టల్‌లో వీడియోలపై కొనసాగుతున్న విచారణ


రెవెన్యూ అధికారులకు క్లాస్..

కాగా.. నిన్న (గురువారం) జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలోనూ రెవెన్యూ శాఖలో అర్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రెవెన్యూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ వచ్చిందని... ఎప్పుడు పరిష్కారం అవుతాయని.. ఎందుకు కావడం లేదని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు.మీకు ఓపిక ఉంది...ప్రజలకు ఓపిక ఉండాలి కదా? ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారని అడిగారు. 22ఏ భూములు, ఇళ్ల స్థలాలు వెంటనే ఎందుకు పరష్కరించలేదని రెవెన్యూ అధికారులను నిలదీశారు. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.


ఇవి కూడా చదవండి...

బాబోయ్.. విద్యార్థులకు ఎన్ని సెలవులో..

నేటి నుంచి హైదరాబాదీలకు పండగే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 12:30 PM