Atchannaidu: వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ
ABN, Publish Date - Jan 04 , 2025 | 01:25 PM
Andhrapradesh: వ్యవసాయంలో భూసార పరీక్షలు అవసరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. భూసార పరీక్షలకు కూడా ఆధునిక టెక్నాలజీ వచ్చిందని.. సేంద్రీయ వ్యవసాయ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి విపత్తులను తట్టుకుంటుందన్నారు. సేంద్రీయ పద్దతిలో పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు.
గుంటూరు జిల్లా, జనవరి 4: వ్యవసాయంలో యాంత్రికరణ అవసరమని వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు (AP Minister Atchannaidu) అన్నారు. గుంటూరు విజ్ఞాన్ యూనివర్శిటీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి అచ్చెన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. వ్యవసాయంపై కనీస దృష్టి పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. యాంత్రికరణను ప్రోత్సాహిస్తామని వెల్లడించారు. డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ప్రవేశపెడతామని తెలిపారు. వ్యవసాయంలో భూసార పరీక్షలు అవసరమన్నారు. భూసార పరీక్షలకు కూడా ఆధునిక టెక్నాలజీ వచ్చిందని.. సేంద్రీయ వ్యవసాయ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి విపత్తులను తట్టుకుంటుందన్నారు. సేంద్రీయ పద్దతిలో పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉందని. వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలో రైతులకు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఖర్చులు తగ్గించుకోండి: ఎంపీ శ్రీకృష్ణ
విజ్ఞాన్ యూనివర్సిటీ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తోందని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు అన్నారు. రైతులకు ఉపయోగపడేలా విద్యార్థులను ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయలో యాంత్రికరణ అవసరమన్నారు. సాంకేతికతను జోడించి వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కవ లాభాలు వచ్చేలా వ్యవసాయం చేయాలని అన్నారు. నూతన విధానాలతో వ్యవసాయ సాగు చేయాలని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల సూచనలు చేశారు.
హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇక వారిలో వణుకే
రైతులకు పురస్కారాలు..
కాగా.. గుంటూరు జిల్లా విజ్ఞాన్ యూనివర్శిటీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అభ్యుదయ రైతులకు పురస్కారాలు ప్రధానం చేశారు. రైతు నేస్తం పౌండేషన్ - విజ్ఞాన్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేశారు. మొత్తం 250 మంది రైతులకు పురస్కారాలు వరించాయి. మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా రైతులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడితో పాటు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు, విజ్ఞాన్ విద్యా సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య , రైతు నేస్తం పౌండేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు పాల్గొ్న్నారు.
ఇవి కూడా చదవండి..
హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇక వారిలో వణుకే
రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu news
Updated Date - Jan 04 , 2025 | 01:30 PM