APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎపీపీఎస్సీ.. విషయం తెలిస్తే..
ABN, Publish Date - Jan 10 , 2025 | 06:41 PM
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ(APPSC) ప్రకటించింది. ఇటీవల ఎనిమిది రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ (APPSC) ప్రకటించింది. ఇటీవల ఎనిమిది రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షా తేదీలను తాజాగా ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ కార్యదర్శి నరసింహమూర్తి (APPSC Secretary Narasimha Murthy) ప్రకటన జారీ చేశారు. మెుత్తం పరీక్షలను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ ప్లానింగ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసుల్లో లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 27, 28 తారీకుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
Amaravti: రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ఆఖరి గడువు ఇదే
ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసుకు సంబంధించి అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 28, 30 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబిల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ సర్వీసుకు ఏప్రిల్ 27, 28 తేదీల్లో, ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టుకు ఏప్రిల్ 28, 29 తారీకుల్లో పరీక్షలు ఉండనున్నాయి. అలాగే ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీసులో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టుకు ఏప్రిల్ 28న పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసుకు సంబంధించి ఏఎస్ఓ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. ఏపీ ఫిషరీ సర్వీసులో ఫిసరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఏప్రిల్ 28, 30 తేదీల్లో పరీక్షలు ఉండనున్నారు. ఈ మేరకు ఎపీపీఎస్పీ కార్యదర్శి నరసింహమూర్తి ప్రకటన జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
APPSCS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎపీపీఎస్సీ.. విషయం తెలిస్తే..
Tirumala: టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం.. విషయం అదేనా..
Updated Date - Jan 10 , 2025 | 10:01 PM