Delhi: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కేంద్ర మంత్రులతో వరస భేటీలు..
ABN, Publish Date - Feb 20 , 2025 | 11:00 AM
ఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పోలవరం నిధుల విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి రూ.12 వేల కోట్లు కేటాయించగా.. నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైనా విజ్ఞప్తి చేశారు.
ఈ భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ రామ్ లీలా మైదానానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త, మంత్రులుగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు నేడు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీయే కీలక నేతలు హాజరవుతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.
ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 4: 45 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తోనూ చంద్రబాబు సమావేశం అవుతారు. మిర్చి ధర పతనం కావడంతో కష్టాలలో ఉన్న రైతులను ఆదుకునేందుకు సహాయం చేయాలని కేంద్రమంత్రిని కోరనున్నారు. దీనిపై కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి లేఖలు రాశారు. అనంతరం సాయంత్రం 5:55 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Students Missing: అదృశ్యమైన ఇంటర్మీడియట్ విద్యార్థినిలు.. సంచలనం సృష్టిస్తున్న ఘటన..
East Godavari: రహస్య ప్రాంతంలో కోడి పందేలు.. ఎంటరైన పోలీసులు.. చివరికి..
Updated Date - Feb 20 , 2025 | 11:01 AM