ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: గుడ్ న్యూస్.. వేల కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. వారికి పండగే..

ABN, Publish Date - Jan 11 , 2025 | 09:24 PM

సంక్రాంతి పండగ వేళ వివిధ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మెుత్తం బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

CM Chandrababu Naidu

అమరావతి: సంక్రాంతి పండగ వేళ వివిధ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మెుత్తం బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు వారికి చెల్లించాల్సిన రూ.6,700 కోట్ల పెండింగ్ నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై మంత్రి పయ్యావుల, అధికారులతో చర్చించారు. ఈ మేరకు విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులకు శుభవార్త చెప్పారు.


ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ కింద రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక ఇన్‌స్టాల్మెంట్ రూ.214 కోట్లు, సీపీఎస్‌కు సంబంధించిన రూ.300 కోట్లు, టీడీఎస్ కింద రూ.265 కోట్లు చెల్లించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి పయ్యావుల తెలిపారు. ఉద్యోగులకు మొత్తంగా రూ. 1,300 కోట్లు విడుదల చేయనున్నట్లు పయ్యావుల వెల్లడించారు. ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.788 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.10 లక్షల లోపు బిల్లులు ఉన్న 26 వేల మంది చిరు కాంట్రాక్టర్లు రూ.586 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి శుభవార్త చెప్పారు.


అమరావతి రైతులకు కౌలు బకాయిలు రూ.241 కోట్లు చెల్లిస్తున్నట్లు మంత్రి పయ్యావుల ప్రకటించారు. చిరు వ్యాపారులు 6 వేల మందికి లబ్ధి చేకూరేలా రూ.100 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.500 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు విడుదల చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన రూ.10 లక్షల కోట్ల బకాయిలు తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం ఆలోచనలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ నడవాల్సిన వ్యవస్థ ఎక్కడా ఆగకుండా జాగ్రత్త పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో కింద పడిపోయిన ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని మంత్రి పయ్యావుల చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Flight Prices: ప్రయాణికులకు షాక్.. హైదరాబాద్ టూ విశాఖపట్నం టిక్కెట్ ధర రూ. 35 వేలు..

Tirumala: తిరుమలలో చిరుత.. టీటీడీ ఉద్యోగికి తీవ్రగాయాలు.. బాబోయ్..

Updated Date - Jan 11 , 2025 | 10:58 PM