Bonded Labor Incident: దారుణం.. డబ్బులు ఇవ్వకుండా పని చేయించి.. ఆపై బాబోయ్..
ABN , Publish Date - Apr 08 , 2025 | 09:26 PM
బాపట్ల జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంక గ్రామంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నంబూరు పద్మ, అగ్ని వెట్టిచాకిరీకి గురయ్యారు. ఓ వ్యక్తి వారితో కొన్నేళ్లుగా బలవంతంగా పని చేయిస్తూ డబ్బులు చెల్లించడం లేదు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెట్టి చాకిరి (Bonded Labor) చేయించడంతోపాటు దంపతులను అమ్మకానికి పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వెట్టిచాకిరి ఘటనపై ఎస్టీ కమిషన్ (ST Commission) ఛైర్మన్ డీవీజీ శంకరరావు (DVG Shankara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Jalaharati Corporation: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. నూతన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ..
బాపట్ల జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంక గ్రామంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నంబూరు పద్మ, అగ్ని వెట్టిచాకిరీకి గురయ్యారు. ఓ వ్యక్తి వారితో కొన్నేళ్లుగా బలవంతంగా పని చేయిస్తూ డబ్బులు చెల్లించడం లేదు. పైగా ఇటీవల వారిని మరో వ్యక్తికి అమ్మకానికి పెట్టాడు. అతని బాధలు భరించలేని బాధితులు.. అక్కడ్నుంచి తప్పించుకుని బాపట్ల కలెక్టర్‌ను ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెట్టి చాకిరి చేయిస్తున్న వ్యక్తి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
SP Ratna: హెలికాఫ్టర్ ధ్వంసం ఘటన.. ఆ ప్రచారం నమ్మెుద్దు: ఎస్పీ రత్న..
ఈ ఘటనపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ విషయం కాస్తా ఎస్టీ కమిషన్‌కు చేరింది. వెట్టి చాకిరి, దంపతులను అమ్మకానికి పెట్టడంపై కమిషన్ ఛైర్మన్ శంకరరావు విస్మయం వ్యక్తం చేశారు. ఈ కాలంలో కూడా వెట్టి చాకిరి చేయించడంపై ఆగ్రహించారు. ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా అధికారులను ఆదేశించారు. వేగంగా విచారణ జరిపి పూర్తి నివేదికను అందించాలని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఇదే నా సవాల్.. సిద్ధమా?: కేంద్ర మంత్రి బండి సంజయ్..
Mark Shankar Health Update: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. పూర్తి వివరాలు చెప్పిన మంత్రి..