Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Feb 16 , 2025 | 06:28 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఈ మేరకు లోకేశ్ షెడ్యూల్ ఖరారు అయ్యింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)లో పర్యటించనున్నారు. రేపు (సోమవారం) మహాకుంభమేళా (Maha Kumbh Mela)కు మంత్రి లోకేశ్ వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. సోమవారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాగ్ రాజ్‌కు మంత్రి లోకేశ్ చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గాన పవిత్ర సంగమం వద్ద వెళ్లనున్నారు.
అక్కడ కుంభమేళాలో పాల్గొన్ని మంత్రి లోకేశ్ పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రయాగ్ రాజ్ విమానాశ్రయం నుంచి వారణాసికి బయలుదేరుతారు. వారణాసి చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి రాత్రి 8 గంటలకు వారణాసి నుంచి విజయవాడకు విమానంలో బయలుదేరుతారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత రోడ్డుమార్గాన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..
Household Budget: ఇంటి బడ్జెట్‌పై కేంద్ర మంత్రి పెమ్మసాని సతీమణి ఏం చెప్పారంటే..