Share News

Guntur: ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో కోట్లలో వసూళ్లు.. కేటుగాడి అరెస్ట్..

ABN , Publish Date - Apr 09 , 2025 | 10:35 AM

తమ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే వడ్డీతో పాటు.. లాభాలు కూడా ఇస్తామంటూ మోసం చేసిన వ్యక్తిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. అతనికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు..

Guntur: ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో కోట్లలో వసూళ్లు.. కేటుగాడి అరెస్ట్..
Cheque Bounce Case

అమరావతి, ఏప్రిల్ 09: అతనో స్కూల్ యజమాని, అదొక్కటే కాదు.. ఇతరత్రా బిజినెస్‌లు కూడా ఉన్నాయి. కానీ, వాటిలో ఏ ఒక్కటీ సక్రమంగా తమ సంపాదనతో స్థాపించింది లేదు. అన్నీ అమాయకులను ముంచి ఏర్పాటు చేసినవే. మరి తప్పు చేస్తే చట్టం ఊరుకుంటుందా.. తీసుకెళ్లి జైల్లో పడేశారు పోలీసులు. అవును, తమ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే వడ్డీతో పాటు.. లాభాలు కూడా ఇస్తామంటూ మోసం చేసిన వ్యక్తిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. అతనికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు, రూ. 10 వేల జరిమానా కూడా విధించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..


నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నందిగం ధర్మరాజు, అతని భార్య రాణి.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో హర్షిత పేరుతో 2009లో స్కూల్‌ స్థాపించారు. ఈ స్కూల్ నిర్మాణం కోసం కొందరు వ్యక్తుల నుంచి డబ్బలు వసూలు చేశారు. తమ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏటా వడ్డీతోపాటు లాభాల్లో 5 శాతం వాటా ఇస్తామంటూ నమ్మబలికారు. ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన ఆలపాటి బ్రహ్మానందరావు 2009లో రూ. 19 లక్షల పెట్టుబడి పెట్టారు. ఇతనితో పాటు మరికొంతమంది కూడా భారీగా ఇన్వెస్ట్ చేశారు. కొంత కాలం తరువాత ధర్మరాజు ఇస్తానన్న వడ్డీ, ప్రాఫిట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు. గట్టిగా నిలదీయడంతో.. చెక్కులు ఇచ్చాడు. అవి కాస్తా బౌన్స్ అవడంతో బాధిత వ్యక్తి ఆలపాటి బ్రహ్మానందరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


2013లో కోర్టును ఆశ్రయించగా.. వడ్డీతో సహ రూ. 63.40 లక్షలు చెల్లించాలంటూ 2019 లో కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ధర్మరాజు.. బాధిత వ్యక్తికి రూ. 26.50 లక్షలు చెల్లించాడు. మిగతా డబ్బులు చెల్లించమని కోరితే.. తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదే విషయాన్ని బాధితుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ధర్మరాజుకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా అతని ఆచూకీ లభించడంతో గుంటూరు అరండల్ పేట్ పోలీసులు ధర్మరాజును అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరుచగా.. 6 నెలల జైలు శిక్ష, 10 వేల జరిమానా విధించింది.


పెద్ద స్టోరీనే ఉంది..

ధర్మరాజు అతని భార్య రాణి, మామ కృష్ణా రావులు తమ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలిస్తామంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసి అనేక మందిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ సొమ్ముతోనే స్కూల్ భవనాన్ని, పలు చోట్ల భూములను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమకు ఇస్తామన్న వడ్డీ, లాభాలు ఇవ్వకపోగా.. అసలు డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కొర్రపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు ధర్మరాజు భార్య రాణిపై కేసు నమోదు చేశారు. ఓ ఎన్నారై నుంచి రూ. 30 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో ధర్మరాజు, రాణి 35 రోజులు చంచల్‌గూడ జైల్లో శిక్ష కూడా అనుభవించారు. రాజుపై 10 ఎఫ్ఐఆర్‌లు, మరికొన్ని చెక్ బౌన్స్ కేసులు కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.


Also Read:

గ్యాస్ సిలిండర్ వాడే వారికి హెచ్చరిక

వచ్చేస్తోంది ‘కొత్త మద్యం’

కొట్లాట కంపల్సరీ అంటున్న రహానె

For More Andhra Prades News and Telugu News..

Updated Date - Apr 09 , 2025 | 10:35 AM