ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jayanti: స్వామి వివేకానంద జయంతి.. వివిఐటి విద్యార్థుల సమతా వాక్

ABN, Publish Date - Jan 12 , 2025 | 09:46 AM

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గుంటూరులోని వివిఐటి విద్యార్థులు సమతా వాక్ నిర్వహించారు. గుంటూరు మస్తానయ్య దర్గా నుండి విజయవాడ కనక దుర్గ ఆలయం వరకు నడవనున్నారు. గత 14 ఏళ్లుగా దర్గా టూ దుర్గా వాక్ కొనసాగిస్తున్నారు.

Swamy Vivekananda Jayanti

గుంటూరు జిల్లా: స్వామి వివేకానంద జయంతి (Swamy Vivekananda Jayanti) సందర్భంగా గుంటూరు (Guntur)లోని వివిఐటి విద్యార్థులు (VVIT students ) సమతా వాక్ (Samatha Walk) నిర్వహించారు. దర్గా టు దర్గా (Dargah to Dargah) పేరుతో విద్యార్థులు 33 కిలోమీటర్ల నడక చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. గుంటూరు మస్తానయ్య దర్గా నుండి విజయవాడ కనక దుర్గ ఆలయం వరకు నడవనున్నారు. గత 14 ఏళ్లుగా దర్గా టూ దుర్గా వాక్ కొనసాగిస్తున్నారు. విద్యార్థులలో ఐకమత్యం, జాతి సమైక్యత , స్ఫూర్తి నింపేందుకు ఈ నడక దోహదపడుతుందని వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అన్నారు.


సేవ్‌ కల్చర్‌...

కగా ఆదివారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం, సంక్రాంతిని పురస్కరించుకుని సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని (సేవ్‌ కల్చర్‌) అనే నినాదంతో తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకతశిల్ప దేవిన శ్రీనివాస్‌ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యత శనివారం సైకతశిల్పం రూపొందించారు. 14 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు కలిగిన ఈ సైకత శిల్పాన్ని ఇద్దరూ 8 గంటలు శ్రమించి తీర్చిదిద్దారు. ఈ శిల్పంలో ఒక వైపు స్వామి వివేకానంద, మరో వైపు సంక్రాంతి వాతావరణాన్ని చూపించారు. ఈ సందర్భంగా దేవిన సిస్టర్స్‌ను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.


స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా కోనసీమ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌, హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా యునైటెడ్‌ డిస్ర్టిక్ట్‌ జోనల్‌ బాడీ బిల్డింగ్‌ అండ్‌ ఫిజిక్‌ స్పోర్ట్స్‌-2025 పోటీలను అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు తెలిపారు. ఈపోటీలకు ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా మాజీ కౌన్సిలర్‌ ఆశెట్టి ఆదిబాబు వ్యవహరిస్తున్నారు. బుధవారం స్థానిక హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌లో పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లాశాఖ అధ్యక్షుడు యెనుముల కృష్ణపద్మరాజు అధ్యక్షతన చాంపియన్‌షిప్‌ ట్రోఫీల ఆవిష్కరణ నిర్వహించారు. అసోసియేషన్‌ కార్యదర్శి కంకిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జోనల్‌ స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల నుంచి సుమారు 250 మందికిపైగా బాడీబిల్డర్లు పాల్గొంటారన్నారు. నాలుగు విభాగాల్లో మొత్తం పది కేటగిరీల్లో పోటీలు జరుగుతాయి. మెన్స్‌ విభాగంలో 55 కిలోలు, 60, 65, 70, 75, 75 కిలోలు పైబడిన విభాగం, మాస్టర్స్‌, దివ్యాంగులు విభాగాల్లో పోటీలు జరుగుతాయి. విజేతలకు నగదు పురస్కారాలతో పాటు మెరిట్‌ సర్టిఫికెట్లు, షీల్డులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్‌, ఆశెట్టి ఆదిబాబు, కమిటీ సభ్యులు మట్టపర్తి సముద్రం, నార్ని శ్రీను, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం

కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద బారులు తీరుతున్న వాహనాలు

సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్నారా.. జాగ్రత్త..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 12 , 2025 | 10:16 AM