AP High Court : ఐపీఎస్ సంజయ్ బెయిల్‌పై విచారణ వాయిదా
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:16 AM
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. నిధులు దుర్వినియోగం ఆరోపణలతో ఏసీబీ అధికారులు నమో దు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి విచారణను వాయిదా వేశారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన శరణు వినయ్‌కుమార్, పాలవలస వెంకట తులసిరామ్, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రాకు చెందిన డైరెక్టర్లు శరణు సూర్య లలిత, వీరమాచనేని శ్రీహరిత వేర్వేరుగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ కూడా మంగళవారానికి వాయిదా వేశారు.