Promotions : ఐదుగురు ఐఏఎస్‌కు పదోన్నతులు
ABN, Publish Date - Jan 01 , 2025 | 04:57 AM
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు ఐపీఎస్‌కు సీనియర్ ఎస్పీలుగా పదోన్నతి
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శిగా ఉన్న సురే్‌షకుమార్ ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి పొందారు. కేంద్ర సర్వీసులో ఉన్న సాల్మన్ ఆరోఖ్యరాజ్ కూడా ముఖ్య కార్యదర్శి హోదాలో కేంద్రంలోనే కొనసాగనున్నారు.2009 బ్యాచ్‌కు చెందిన మరో ముగ్గురికి కార్యదర్శి హోదా కల్పించారు. సీఎం అదనపు కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు కార్యదర్శి హోదాలో ఆయన సీఎంవోలో కొనసాగుతారు. సెర్ప్ సీఈవో జీ.వీరపాండియన్, కడప కలెక్టర్ సి.శ్రీధర్ కూడా కార్యదర్శిగా పదోన్నతి పొందారు. వీరు కూడా ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగనున్నారు. 2012 బ్యాచ్‌కు చెందిన సిద్ధార్థ కౌశల్, విక్రాంత్ పాటిల్ సీనియర్ ఎస్పీలుగా పదోన్నతి పొందారు.
Updated Date - Jan 01 , 2025 | 04:58 AM