Share News

Polavaram Flood Dispute: వరదొస్తే పోలవరం వల్లేనా

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:04 AM

తెలంగాణ మరియు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి వివాదం చోటు చేసుకుంది. గోదావరికి వరద వస్తే పోలవరం కారణమా అని ఏపీ స్పందించింది, నీటిని నిల్వ చేయకపోతే బ్యాక్‌వాటర్‌కు ఆస్కారం ఉండదు అని వివరించింది

Polavaram Flood Dispute: వరదొస్తే పోలవరం వల్లేనా

  • ప్రాజెక్టులో నీటిని నిల్వే చేయకుంటే బ్యాక్‌వాటర్‌కు ఆస్కారం ఎక్కడిది?

  • పీపీఏ భేటీలో తెలంగాణపై ఏపీ ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): గోదావరికి వరద వస్తే పోలవరం ప్రాజెక్టు వల్లేనంటూ నిందలేస్తారా అని తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ నిలదీసింది. మంగళవారం హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చైర్మన్‌ అతుల్‌ జైన్‌ అధ్యక్షతన పోలవరం ఎత్తుపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌, ఏపీ తరఫున పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జల వివాదాల విభాగం సీఈ సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు. పోలవరం నిర్మాణంతో బూర్గంపాడు గ్రామం 2020-22 వరదల సమయంలో ముంపునకు గురైందని తెలంగాణ ప్రస్తావించింది. అప్పటికి ప్రాజెక్టు పూర్తికాలేదని.. నీటిని నిల్వ కూడా చేయలేదని.. అలాంటప్పుడు బ్యాక్‌వాటర్‌ వరదకు ఆస్కారం ఎక్కడిదని ఆంధ్రప్రదేశ్‌ నిలదీసింది. నదీపరివాహక ప్రాంతంలో వరదలు రావడం సహజమని.. గోదావరికి వరద వస్తే అ ది పోలవరం వల్లేనంటూ నిందలు వే యడం అలవాటుగా మారిందని ఆగ్ర హం వ్యక్తం చేసింది. 45.72 మీటర్ల కాంటూరులో నీటిమట్టం మార్కులను 36 ప్రదేశాల్లో గుర్తించాలని తెలంగాణ చేసిన డిమాండ్‌ను ఆంధ్ర అధికారులు తోసిపుచ్చారు. గతంలో పేర్కొన్నట్లుగా రెండు చోట్ల మాత్రమే మార్కింగ్‌ చేస్తామని స్పష్టం చేశారు. కిన్నెరసాని, ము ద్దేరు వాగు వద్ద సర్వే చేయాలని తెలంగాణ కోరగా.. ప్రాజెక్టు రెండో దశలో 45.72 మీటర్ల గరిష్ఠ కాంటూరులో నీటి ని నిల్వ చేసే సమయంలో మార్కింగ్‌ చేస్తామని వారు తేల్చిచెప్పారు.

Updated Date - Apr 09 , 2025 | 05:04 AM