YS Abhishek Reddy: మరికాసేపట్లో ప్రారంభం కానున్న వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు..
ABN, Publish Date - Jan 11 , 2025 | 02:46 PM
వైఎస్ అభిషేక్ రెడ్డి (YS Abhishek Reddy) పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నివాళులు అర్పించారు. తన సోదరుడు అభిషేక్ రెడ్డి అంత్యక్రియల నేపథ్యంలో పులివెందుల(Pulivendula)కు వైఎస్ జగన్ చేరుకున్నారు.
కడప: వైఎస్ అభిషేక్ రెడ్డి (YS Abhishek Reddy) పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నివాళులు అర్పించారు. తన సోదరుడు అభిషేక్ రెడ్డి అంత్యక్రియల నేపథ్యంలో పులివెందుల (Pulivendula)కు వైఎస్ జగన్ చేరుకున్నారు. అనంతరం ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్న వయసులోనే అభిషేక్ రెడ్డి చనిపోవడంపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మరికాసేపట్లో అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. అభిషేక్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
విషయం తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ శ్రేణులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా, ఇవాళ (శనివారం) ఉదయం హైదరాబాద్ నుంచి పులివెందులకు మృతదేహాన్ని తరలించారు. తన సోదరుడు మరణవార్త విన్న జగన్ కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన పులివెందులకు చేరుకున్నారు. అనంతరం అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మరికాసేపట్లో జరగబోయే అంత్యక్రియల్లో జగన్ ఆయన సతీమణి భారతి పాల్గొననున్నారు. మరోవైపు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అభిషేక్ మృతదేహానికి ఘననివాళులు అర్పిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సహా పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ఇప్పటికే అభిషేక్ పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. వైసీపీ శ్రేణులు సైతం పెద్దఎత్తున చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: క్షమాపణలు చెప్పాల్సిందే!
Updated Date - Jan 11 , 2025 | 02:48 PM