AP News: ఎక్కడున్నా వదిలిపెట్టను.. డిఎస్పీని బెదిరించిన జగన్..!
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:30 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెచ్చిపోయారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను వైఎస్ జగన్ బెదిరింపులకు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడంపై మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) రెచ్చిపోయారు. పులివెందుల (Pulivendula) డీఎస్పీ మురళీనాయక్(DSP Murali Nayak)ను వైఎస్ జగన్ బెదిరింపులకు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడంపై మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, నిన్ను వదిలిపెట్టేది లేదంటూ డీఎస్పీ మురళీ నాయక్‌కు జగన్ వార్నింగ్ ఇచ్చారు.
Anakapalli: జిల్లాలో వెలుగు చూసిన అరుదైన జంతు జాతి.. ఆందోళనలో ప్రజలు..
నిన్న (ఆదివారం) తన సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చారు. కార్యక్రమం అనంతరం వెళ్లిపోయే సమయంలో తన హెలీప్యాడ్ వద్దకు డీఎస్పీ మురళీనాయక్‌ను జగన్ రప్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీకి జగన్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై డీఎస్పీని జగన్ నిలదీశారు. విచారణ పేరుతో తమ వారిని వేధిస్తావా? అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
R Naidu: వాస్తవాలు తెలుసుకుని రాయండి
ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి విషయంలో తప్పు చేస్తున్నావంటూ డీఎస్పీని జగన్ బెదిరించారు. మీరు నమోదు చేస్తున్న కేసులన్నీ తప్పుడు కేసులేనని, టీడీపీ నేతలు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నావంటూ మురళీ నాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మారకపోతే భవిష్యత్తులో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటావంటూ హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎక్కడ ఉన్నా వదిలిపెట్టనని జగన్ బెదిరింపులకు దిగారు. మాజీ సీఎం స్థాయి వ్యక్తి నేరుగా బెదిరించడంతో డీఎస్పీ మురళీ నాయక్ మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఆ కలెక్టర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్
Amaravati : ప్రతి ఇంటా భోగ భాగ్యాలు వెల్లివిరియాలి.. తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్
Updated Date - Jan 13 , 2025 | 03:37 PM