MLC Nagababu: పల్లె పండుగ రోడ్లకు ప్రారంభోత్సవాలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:51 AM
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.3.70 కోట్లతో 21 రహదారులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, టీడీపీ కార్యకర్తలు ‘జై టీడీపీ’ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు పై దాడి జరిగింది,

పిఠాపురంలో రెండోరోజు ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన
టీడీపీ నేతల ‘జై వర్మ’ నినాదాలు
పిఠాపురం/ పిఠాపురం రూరల్/ గొల్లప్రోలు రూరల్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.3.70కోట్లతో నిర్మించిన 21 రహదారులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శనివారం ప్రారంభించారు. పిఠాపురంలో బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రెండోరోజు నియోజకవర్గంలోని 8గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. కాగా, కుమారపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ‘జై టీడీపీ, జై వర్మ’ అంటూ నాగబాబు ఎదుటే నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలు నాగబాబు కాన్వాయ్ వెళుతుండగా ‘జై వర్మ’ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు మోటరు సైకిల్ అద్దాలు పగులగొట్టారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నాగబాబు రెండు రోజుల కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ హాజరు కాలేదు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News