ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

ABN, Publish Date - Mar 17 , 2025 | 10:41 AM

Raghurama serious: శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సీరియస్ అయ్యారు. దయచేసి సభ్యులు అలా చేయవద్దని.. కఠిన చర్యలు తప్పవని స్ఫష్టం చేశారు.

Deputy Speaker Raghurama Krishnam Raju

అమరావతి, మార్చి 17: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (Deputy Speaker Raghuram Krishnam Raju) సీరియస్ అయ్యారు. సభలో సభ్యులు ఫోన్ మాట్లాడటంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్.. అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. ఫోన్‌ను సభ్యులు సైలెంట్‌లో పెట్టుకోవాలన్నారు. సభలో చర్చలు జరుగుతున్నప్పటికీ వాటిన పట్టించుకోకుండా కొందరు సభ్యులు ఫోన్‌లో మాట్లాడటం సరికాదన్నారు. ఇది విజ్ఞప్తి అని.. విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ తెలిపారు.


రఘురామ వ్యాఖ్యలపై సభ్యుడు వేగుళ్ల జోగేశ్వరరావు స్పందించారు. సభలో జామర్లు పెట్టాలని సూచించారు. దీనిపై రఘురామ మాట్లాడుతూ.. మన బలహీనత జామర్లపైకి నెట్టద్దని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

12వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 11:45 AM