Share News

AP Cabinet: ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:05 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వరయంలో 24 అంశాలు ఎజెండాగా మంత్రి మండలి సచివాలయంలో కీలక సమావేశం అయింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌పై మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే ఈనెల 10వ తేదీన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయునుంది.

AP Cabinet: ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ
AP Secretariat

అమరావతి: ఏపీ సచివాలయం (AP Secretariat)లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) సమావేశం (Meeting) అయింది. దాదాపు 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ జరుగుతోంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి తుదినిర్ణయం తీసుకోనుంది.

Also Read..: ఖైదీతో స్నేహితుల రీల్స్.. వీడియో వైరల్..


అలాగే మంత్రి వర్గం సీఆర్డిఏ 46 ఆధారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపనుంది. అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భ‌వ‌నాల టెండ‌ర్లకు ఆమోదం తెలిపనుంది. ఎల్‌వ‌న్‌గా నిలిచిన సంస్థల‌కు లెట‌ర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రూ. 617 కోట్లతో అసెంబ్లీ బేస్ మెంట్ + జీ + 3 + వ్యూయింగ్ ప్లాట్ ఫాంలు + ప‌నోర‌మిక్ వ్యూ (బిల్ట‌ప్ ఏరియా 11.22 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగులు,ఎత్తు 250 మీట‌ర్లు) అసెంబ్లీ నిర్మాణానికి టెండ‌ర్ల‌లో ఎల్‌వ‌న్‌గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ (LOA) ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది. రూ.786 కోట్లతో హైకోర్టు బేస్ మెంట్ + జీ + 7 అంతస్తుల్లో నిర్మాణం, బిల్డప్ ఏరియా 20.32 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగులు ఎత్తు 55 మీట‌ర్లు... ఎల్‌వ‌న్‌గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదించనుంది. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్సైపీబీ) 5వ సమావేశం నిర్ణయాలను ఆమోదిస్తుంది. రూ. 30, 667 కోట్ల పెట్టుబలతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల ఎస్ఐపీబీలో నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా 32,133 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.


శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు , చిత్తూరు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలో సీనరేజీ ఫీజు వసూలు కాంట్రాక్టు గడువు పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. విశాఖ ఐటీ హిల్స్‌లో టీసీఎస్‌కు 21.66 ఎకరాల భూమిని రూ. 99 పైసలకు లీజు ఇచ్చేందుకు అంగీకారం తెలపనుంది. టీసీఎస్ ఏర్పాటు ద్వారా రూ.1370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావటంతో పాటు 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖ ఐటీ హిల్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56 ఎకరాల కేటాయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనుంది. 3 జిల్లాల్లో 199 వ్యవసాయ ఫీడర్ల ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌లకు ఆమోదం తెలపనుంది. వివిధ ప్రాంతాల్లో సౌర, పవన, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు 6.35 ఎకరాల భూమి కేటాయించనుంది. కుప్పంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భూ మార్పిడికి ఆమోదం... నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

చిత్తూరు జిల్లాలో పరువు హత్య..

పూజారి తన్నుల కోసం బారులు తీరిన భక్తులు

For More AP News and Telugu News

Updated Date - Apr 15 , 2025 | 12:24 PM