AP Highcourt: ఏపీ హైకోర్టులో చెవిరెడ్డికి షాక్
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:05 AM
AP Highcout: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఫోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెవిరెడ్డిపై తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు పెట్టారు.
అమరావతి, జనవరి 10: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి (Former MLA Chevireddy Bhasakar Reddy) హైకోర్టులో (AP Highcourt) షాక్ తగిలింది. ఫోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యేపై తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు పెట్టారు. తిరపతిలో నమోదైన ఫోక్సో కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును చెవిరెడ్డి ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం చెవిరెడ్డి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఓ బాలికపై చెవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది రుజువు కావడంతో తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆ తరువాత అటువంటి వ్యాఖ్యలు చేయలేదని బాలిక తండ్రి చెప్పినప్పటికీ అంతకుముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు చెవిరెడ్డిపై ఫోక్సో కేసు పెట్టారు.
ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, అలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు ఉదయం తీర్పు ఇచ్చిన హైకోర్టు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
కాగా.. చెవిరెడ్డిపై గత ఏడాది నవంబర్‌లో పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో ఆయన దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఓ బాలిక స్కూల్ నుంచి వచ్చే సమయంలో గాయాలతో పడి ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిగిందంటూ అప్పట్లో వైసీపీ నేతలు ప్రచారం చేశారు. బాలిక తండ్రి అలాంటేది జరగలేదని చెప్పినప్పటికీ లాభం లేకుండా పోయింది. బాలికపై జరిగిన దుష్ప్రచారంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేస్తున్న సమయంలో చెవిరెడ్డి అక్కడకు చేరుకుని హడావుడి చేశారు. అత్యాచారం జరిగినట్లు ప్రచారం చేశారు. అదేమీ లేదని బాలిక తండ్రి చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. ఆ తరువాత తనపై ఎలాంటి అత్యాచారం జరిగలేదని బాలిక పోలీసుల ఎదుట చెప్పింది. అయితే వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
Minister Narayana: భవన నిర్మాణాలు, లేఅవుట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Skill Census: స్కిల్ సెన్సస్‌కు సాంకేతిక సహకారం.. ముందుకొచ్చిన సాఫ్ట్‌వేర్ సంస్థ
Read Latest AP News And Telugu news
Updated Date - Jan 10 , 2025 | 11:22 AM