AP Highcourt: రఘురామ కేసులో ప్రభావతికి హైకోర్టు షాక్
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:57 AM
AP Highcourt: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో చుక్కుదురైంది. ప్రభావతి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
అమరావతి, జనవరి 10: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై (Deputy Speaker Rahurama Krishnamraju) సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో డాక్టర్ ప్రభవతికి హైకోర్టులో (AP Highcourt) ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో జిల్లా సెషన్స్ కోర్టు కూడా ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో రఘురామపై థర్డ్ డిగ్రీని ప్రయోగించిన కేసులో గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ముందుగా జిల్లా సెషన్స్‌కోర్టులో బెయిల్ పిటిషన్ కోసం ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ప్రభావతి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టుకు కూడా ప్రభావతి పిటిషన్‌ను కొట్టివేసింది. కస్టోడియల్ టార్చర్ అనంతరం సంబంధిత డాక్టర్లు రఘురామకు దెబ్బలు తగిలాయని నివేదికలు ఇచ్చారు.
అయితే ప్రభావతి ఆ నివేదికను మార్చి.. ఆయనకు ఎటువంటి గాయాలు అవలేదని నివేదిక ఇచ్చారని పోలీసులు అభియోగం మోపారు. ఇదే కేసులో అప్పట్లో ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న విజయ్‌పాల్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. అలాగే ఈ కేసులోనే అప్పట్లో రఘురామ కృష్ణం రాజు గుండెపై కూర్చుని పిడిగుద్దులు గుద్దారని, హత్యాయత్నానికి పాల్పడ్డారని గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబును విచారణకు పిలిపించిన ఒంగోలు ఎస్పీ.. ఆపై ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఒంగోలు ఎస్పీ వ్యవహరిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి రఘురామ.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభావతి, విజయపాల్, తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటలిజెన్స్ బాస్‌గా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వాళ్లు ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లలేదు. మిగిలిన వారు హైకోర్టుకు వెళ్లినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది.
ఇవి కూడా చదవండి...
Pawan: పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం.. మినీ గోకులం ప్రారంభించనున్న పవన్..
Minister Narayana: భవన నిర్మాణాలు, లేఅవుట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Read Latest AP News And Telugu news
Updated Date - Jan 10 , 2025 | 01:03 PM