AP Govt: ఏపీఎస్ ఆర్టీసీ బోర్డును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ABN, Publish Date - Feb 05 , 2025 | 06:14 PM
AP Govt: ఏపీఎస్ ఆర్టీసీ బోర్డును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ చైర్మన్‌గా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వైస్ చైర్మన్‌గా పీ.యస్. మునిరత్నంలతోపాటు డైరెక్టర్లుగా రెడ్డి అప్పలనాయుడు, సురేష్ రెడ్డి, పూలా నాగరాజులను నియమించారు. అలాగే రవాణా, ఆర్ధిక, జీఏడీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఎపీయస్ ఆర్డీసీ ఎండీ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ఫైనాన్షియల్ అడ్వయిజర్, కేంద్ర ప్రభుత్వ రోడ్ సేఫ్టీ డైరెక్టర్, ట్రాన్స్‌పోర్టు డైరెక్టర్లతోపాటు కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ది శాఖ డైరెక్టర్లను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

అమరావతి, ఫిబ్రవరి 05: ఏపీఎస్ ఆర్టీసీ బోర్డును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 6ను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జారీ చేశారు. ఆర్టీసీ చైర్మన్‌గా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వైస్ చైర్మన్‌గా పీ.యస్. మునిరత్నంలతోపాటు డైరెక్టర్లుగా రెడ్డి అప్పలనాయుడు, సురేష్ రెడ్డి, పూలా నాగరాజులను నియమించారు. అలాగే రవాణా, ఆర్ధిక, జీఏడీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఎపీయస్ ఆర్డీసీ ఎండీ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ఫైనాన్షియల్ అడ్వయిజర్, కేంద్ర ప్రభుత్వ రోడ్ సేఫ్టీ డైరెక్టర్, ట్రాన్స్‌పోర్టు డైరెక్టర్లతోపాటు కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ది శాఖ డైరెక్టర్లను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.
మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణరావుతోపాటు ఆర్టీసీ వైస్ చైర్మన్‌గా పి. మునిరత్నంలను చంద్రబాబు ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో నియమించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం నామినేటేడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులోభాగంగా సదరు పోస్టుల తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జాబితాలో వీరిద్దరికి ఈ పదవులు కేటాయించిన విషయం విధితమే.
ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి. దీంతో మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థలను నిలిపే క్రమంలో సీట్ల సర్ధుబాటు జరిగింది. దీంతో మచిలీపట్నం ఎంపీ స్థానం జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో ఈ స్థానం నుంచి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గెలుపొందారు. దీంతో ఈ స్థానం నుంచి గతంలో అంటే.. 2009, 2014లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి కొనకళ్ల నారాయణ గెలుపొందారు.
Also Read: మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు ఏలుతాం.. జగన్ జోస్యం
ఇక 2019 ఎన్నికల్లో నాటి వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి చేతిలో కొనకళ్ల నారాయణ ఓటమి పాలయ్యారు. అదే విధంగా 2024లో ఈ సీటు జనసేనకు వెళ్లడంతో... టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అదీకాక చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో.. నామినేటేడ్ పోస్టులు దశలా వారీగా నియమించారు. దీంతో కోనకళ్ల నారాయణరావుతోపాటు చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన పి. మునిరత్నం నాయుడికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు కట్టబెట్టారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డ్రగ్స్ పెడ్లర్లు అరెస్ట్.. షూటర్ల కోసం గాలింపు
Also Read : కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు
Also Read: మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి: ప్రత్తిపాటి డిమాండ్
For AndhraPradesh News And Telugu News
Updated Date - Feb 05 , 2025 | 06:14 PM