అసంపూర్తి రోడ్లతో అవస్థలు!
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:49 AM
గండిగుంట గ్రామ పంచాయతీ పరిఽధిలో విజయ వాడ- మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపు లా సర్వీసు రోడ్ల నిర్మాణం ఏళ్ల తరబడి పూర్తికాక అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగి పరిసర గ్రామాల ప్రజలు గాయాలపాలవుతున్నారు.

నిత్యం ప్రమాదాలు
పట్టించుకోని అధికారులు
నిర్మాణం చేపట్టని కాంట్రాక్టర్లు
ఇబ్బందిపడుతున్న ప్రజలు
ఆనందపురం వద్ద అసంపూర్తిగా సర్వీసు రోడ్డు
(ఉయ్యూరు - ఆంధ్రజ్యోతి)
గండిగుంట గ్రామ పంచాయతీ పరిఽధిలో విజయ వాడ- మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపు లా సర్వీసు రోడ్ల నిర్మాణం ఏళ్ల తరబడి పూర్తికాక అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగి పరిసర గ్రామాల ప్రజలు గాయాలపాలవుతున్నారు. గండిగుంట ఫ్లైవోవర్ నుంచి చినఓగిరాలవైపు వెళ్లే సర్వీసు రోడ్డు అంగడాల పెట్రోల్ బంక్ సమీపం నుంచి ఆనందపురం వరకు కంకర పోసి నిర్మాణం పూర్తి చేయకపోవడంతో చినఓగిరాల, ఆనం దపురం, వెంకటాపురం నుంచి ఉయ్యూరు వచ్చి వెళ్లేవారికి అసౌకర్యం కలుగుతుంది. కంకర పోసి తారువేయకుండా వదిలివేయడంతో రాళ్లులేచి ద్వి చక్ర వాహనాలపై వెళ్లేవారు ప్రమాదాలకు గురై గాయాలపాల వుతున్నారు. జాతీయ రహదారికి మరోవైపు మూర్తిరాజుపాలెం వద్ద నుంచి గండి గుంట సెంటర్‌వరకు మధ్యలో రైస్‌మిల్లు ప్రాంతం లో రోడ్డు నిర్మాణం ఏళ్ల తరబడి చేపట్టక పోవడంతో ఆకునూరు నుంచి ఉయ్యూరు వైపు వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రహదారి పూర్తయి దశాబ్ధకాలం కావస్తున్నా సర్వీసు రోడ్లు నిర్మాణం పూర్తికాకపోవడం పట్ల పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు నడిపేవారి నుంచి ముక్కు పిండి టోల్‌గేట్ వసూలు చేస్తున్న హైవే కాంట్రాక్టర్లు సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తిచేయకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.