ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme court: సుప్రీంలో చంద్రబాబుకు భారీ ఊరట

ABN, Publish Date - Jan 15 , 2025 | 12:50 PM

CM Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంలో ఊరట లభించింది. స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.

AP CM Chandrababu Naidu

న్యూఢిల్లీ, జనవరి 15: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (AP CM Chandrababu Naidu) సుప్రీం కోర్టులో (Supreme Court) భారీ ఊరట లభించింది. స్కిల్‌ కేసులో (Skill Case) బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ ఫైల్‌ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి తెలిపారు. చార్జిషీట్‌ దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్‌ బేలా త్రివేది వెల్లడించారు.


2023 నవంబర్‌లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ను రద్దు చేయాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్‌ రద్దు పిటిషన్‌‌ను డిస్మిస్‌ చేస్తూ ఈరోజు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని జర్నలిస్టు ఇంప్లీడ్ పిటిషన్‌ వేయగా.. దాన్ని కొట్టివేస్తూ జర్నలిస్టుపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అసలు ఈ కేసుకు మీకు సంబంధం ఏంటి... మీరెందుకు ఇందులో జోక్యం చేసుకున్నారు’’ అంటూ జర్నలిస్టును కోర్టు మందలించింది. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టు సమర్థించింది. ఆ బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.


కాగా.. ఏపీ స్కిల్ కేసుకు సంబంధించి గత ప్రభుత్వం మాజీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి జైలుకు కూడా పంపించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి గతంలో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సుప్రీంలో వాదనలు జరుగాయి. స్కిల్‌ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగిందని అప్పటి సర్కార్ పేర్కొనలేదు. కావాలని కుట్ర పూరితంగా రాజకీయ కక్షలో భాగంగా చంద్రబాబుపై అవినీతి కేసును మోపింది. అక్రమ కేసును పెట్టి మరీ చంద్రబాబును జైలుకు తరలించారు. ఇదే పిటిషన్‌ను విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేసింది.


ఇవి కూడా చదవండి...

సంక్రాంతికి హరిదాసులు ఎందుకు వస్తారంటే..

సీఎం చంద్రబాబు నిర్ణయంతో కౌలు రైతుల హర్షం..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 15 , 2025 | 01:10 PM