AP Budget: ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..
ABN , Publish Date - Feb 28 , 2025 | 10:12 AM
రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అలాగే మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తికాగానే... వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అసెంబ్లీ (Assembly)లోని సీఎం ఛాంబర్ (CM Chamber) లో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వర్గం బడ్జెట్‌కు ఆమోదం (Budget Approval) తెలిపింది. ఆ తర్వాత 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తికాగానే... వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.50 వేల కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అన్నదాత-సుఖీభవ, పంటల బీమా, వడ్డీ లేని - పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్‌పామ్, రాయితీ విత్తనాలు, ఎన్టీఆర్ జలసిరి, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతి, వ్యవసాయ సాంకేతిక పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి, నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్త కూడా చదవండి..
వైఎస్సార్‌సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..
కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగా ముందుగా విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్,ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్‌లు హాజరయ్యారు.
ఆపై బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద టీటీడీ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి వేడుకున్నారు. పూజల అనంతరం బడ్జెట్ ప్రతులతో మంత్రి పయ్యావుల అసెంబ్లీకి బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను మంత్రి అందజేశారు. మొత్తం రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇదేంది జగన్.. నాడు అలా.. నేడు ఇలా..
పోసాని రిమాండ్‌పై న్యాయవాది పొన్నవోలు ఎమన్నారంటే..
పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News