Share News

Finance Commission: ఏపీలో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటన

ABN , Publish Date - Apr 16 , 2025 | 07:34 AM

రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనున్నారు. ఈ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు.

Finance Commission: ఏపీలో  కేంద్ర ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటన
16th Finance Commission

అమరావతి: రాష్ట్రానికి వచ్చిన పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం సభ్యులు (16th Finance Commission) బుధవారం నుంచి ఏపీ (AP)లో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వారికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ఫైనాన్స్ కమిషన్ బృందం రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనుంది. విజయవాడ (Vijayawada), తిరుపతి (Tirupati) నగరాల్లో పర్యటించనుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఫైనాన్స్ కమిషన్ (Finance Commission) బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ కానున్నారు.

Also Read..: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ


బృందానికి సీఎం ప్రజంటేషన్..

బుధవారం ఉదయం 10:30 గంటల నుండి 11:00 గంటల వరకు సచివాలయంలోని మొదటి బ్లాకులో అమరావతి ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్‌ను ఫైనాన్స్ కమిషన్ బృందం తిలకించనుంది. 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మొదటి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్థిక సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు. సాయంత్రం మూడున్నరకు నోవాటెల్ హోటల్లో ఆర్థిక సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు విజయవాడలోని బెర్మ్ పార్కులో ముఖ్యమంత్రి ఇచ్చే డిన్నర్‌కు హాజరవుతారు. రాత్రి పది గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరి వెళతారు. గురువారం మధ్యాహ్నం రెండున్నరకు స్థానిక ప్రజాప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశం అవుతారు. అనంతరం వాణిజ్య, వ్యాపారవర్గాలతో తిరుపతిలో సమావేశం నిర్వహిస్తారు. తిరిగి ఈ నెల 18వ తేదీ (శుక్రవారం) తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఈ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది. కాగా రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటా శాతాన్ని పెంచేలా ఆర్థిక సంఘం సిఫార్సులు చేసే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మన చంద్రన్న పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

అల్లు అర్జున్ తో ముగ్గురు ముద్దుగుమ్మలు

For More AP News and Telugu News

Updated Date - Apr 16 , 2025 | 07:34 AM