CM Chandrababu: అమరావతి కౌలు రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త
ABN, Publish Date - Jan 15 , 2025 | 07:13 AM
అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు సంక్రాంతి పండుగ సందర్బంగా కౌలు డబ్బులు వారి అకౌంట్లలో జమ చేశారు. భూములిచ్చిన రైతులకు పదో ఏడాదికి సంబంధించిన కౌలు చెల్లింపులు చేశారు. సంక్రాంతి పండుగ వేళ డబ్బులు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పండుగను సంతోషంగా జరుపుకున్నారు.
అమరావతి: సంక్రాంతి పండుగ (Sankranti festival) సందర్భంగా అమరావతి (Amaravati) కౌలు రైతులకు (Tenant Farmers) ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) శుభవార్త (Good News) చెప్పారు. పెండింగ్ కౌలు డబ్బులను కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసింది. కక్ష్య సాధింపుతో గత జగన్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన కౌలు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిని విధ్వంసం చేయడమే కాకుండా మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడిన జగన్.. రాజధాని రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగారు. మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ఆర్-5 జోన్ ఏర్పాటును రైతులు వ్యకతిరేకించారు. రాజధాని వెలుపుల ఉన్నవారికి అమరావతిలో నివాస స్థలాలు ఇవ్వడంపై రాజధాని రైతులు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో గృహ నిర్మాణాన్ని సుప్రీం కోర్టు వ్యతిరేకించింది. దీంతో జగన్ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగింది. రైతులకు చెల్లించాల్సిన రెండేళ్ల కౌలు చెల్లింపులను నిలిపివేసింది. దీనిపై రైతులు హైకోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ అవి పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతుల కౌలు బకాయిలు చెల్లిస్తామని, రాజధాని నిర్మాణం కూడా కొనసాగిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రెండు నెలల క్రితం 9వ సంవత్సరం చెల్లించాల్సిన కౌలును జమ చేసింది. అనంతరం సంక్రాంతి పర్వదినం సందర్బంగా 10వ ఏడాది కౌలును రూ. 255 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసింది. చివరకు రాజధానిలో భూమిలేని నిరుపేదలకు చెల్లించే నెలవారి పెన్షన్లు కూడా వారి ఖాతాల్లో జమ చేశారు. దీంతో రాజధాని రైతుల్లో ఆనందం వెల్లివెరిసింది.
ఎన్నికలకు ముందు కూటమి తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలు హామీ ఇచ్చిన విధంగా ఏకైక రాజధాని అమరావతేనని.. నిర్మాణాలు కూడా తిరిగి ప్రారంభించేందుకు టెండర్లు కూడా పిలిచారు. ప్రపంచ బ్యాంకు రూ. 17వేల కోట్లు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులు కలిపి రూ. 16వేల కోట్లు కలిపి మొత్తం రూ. 31వేల కోట్ల రుణం మంజూరు చేశాయి. ఈ రుణంతో రాజధానిలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణం, సెక్రటేరియట్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, మంత్రులు, జడ్జీలు, ఇతర భవన నిర్మాణాలు ప్రారంభమవుతాయి. సీడ్ యాక్సెస్ రోడ్లు, అంతర్గత రహదార్లు.. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయల కల్పన అంటే.. రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పించనున్నారు. వాటికి కూడా సీఆర్డీయే టెండర్లు పిలిచింది. రాజధాని రైతులకు మరో ఐదేళ్లు కౌలు ఇచ్చేందుకు కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే అంగీకరించారు. రాబోయే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నా వల్ల లక్షల మంది కోటీశ్వరులు అయ్యారు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 15 , 2025 | 07:13 AM