CM Chandrababu: విజయవాడ: రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసుకు సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jan 10 , 2025 | 10:49 AM
సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటనకు వెళతారు. 12.05 గంటలకు చేబ్రోలు హనుమయ్య కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు తిరుగు ప్రయాణమై వెలగపూడిలోని సచివాలయానికి వస్తారు. అక్కడ విజయవాడ వెస్ట్రన్ బైపాస్‌పై అధికారులతో సమీక్ష జరుపుతారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం విజయవాడ రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. దావోస్ వెళుతున్న నేపథ్యంలో డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ తీసుకోనున్నారు.11 గంటలకు ఉండవల్లిలోని తన ఇంటి నుంచి బయల్దేరి 11.10 బందర్ రోడ్‌లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళతాను. అనంతరం అక్కడనుంచి తిరిగి ఉండవల్లి చేరుకుని హెలికాప్టర్‌లో గుంటూరు పర్యటనకు వెళతారు. 12.05 గంటలకు చేబ్రోలు హనుమయ్య కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ ప్రదర్శనను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు తిరుగు ప్రయాణమై వెలగపూడిలోని సచివాలయానికి వస్తారు. అక్కడ విజయవాడ వెస్ట్రన్ బైపాస్‌పై అధికారులతో సమీక్ష జరుపుతారు. సాయంత్రం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు.
ఈ వార్త కూడా చదవండి..
తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు..
కాగా ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. మంత్రులు లోకేశ్, టీజీ భరత్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ప్రైవేట్ సెక్రటరీ కృష్ణ కపర్థి రావి, సీఎస్‌వో శ్రీనాథ్ బండారు, వైద్యాధికారి ఎండీ. అజారుద్దీన్‌తో కూడిన బృందం 19నే దావోస్‌కు బయల్దేరుతుంది. వీరి పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘షేపింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్’ అనే థీమ్‌తో నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. వారి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు దావోస్‌ను వేదికగా ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సహజ వనరులు, అవకాశాల గురించి పెట్టుబడిదారులకు వివరిస్తారు. వివిధ చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక పాలసీలు, సుస్థిర అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయం, మాన్యుఫాక్చరింగ్, ఐటీ తదితర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం మార్గదర్శకాల ప్రకారం దావోస్ సదస్సు వద్ద ఏపీ ప్రభుత్వం ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసేందుకు 500 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం రిజర్వ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని.. దీని కోసం వరల్డ్ ఎకనమిక్ ఫోరంను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక రంగం, వ్యవసాయం, తయారీ, ఐటీ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. దావోస్‌లో జరిగే సదస్సుకు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పలువురు అధికారులు హాజరవుతారు. సీఎం టీమ్‌తో పాటుగా పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్ సదస్సుకు వెళతారు. దావోస్ సదస్సులో రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ వివరించనుంది. షేపింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్‌తో ఏపీ ప్రభుత్వం పెవిలియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దావోస్‌కు వెళుతున్న సంగతి తెలిసిందే.. ఇద్దరు సీఎంల దావోస్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీ అసెంబ్లీ .. 41 స్థానాలు ఖరారు చేయనున్న బీజేపీ..
వైకుంఠ ఏకాదశి.. టీటీడీ కీలక నిర్ణయం
శ్రీ మహావిష్ణు రూపంలో భద్రాద్రి రామయ్య..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 10 , 2025 | 10:49 AM