Crime News: మరో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం..
ABN, Publish Date - Jan 05 , 2025 | 01:26 PM
ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
కృష్ణా జిల్లా: ఏపీలో చిన్నారులపై దాడులు ఆగడం లేదు. అధికారులు కఠిన చర్యలు ఎన్ని తీసుకుంటున్నా మానవమృగాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఎక్కడోచోట చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తునే ఉన్నాయి.
తాజాగా, గుడివాడలో దారుణం చోటుచేసుకుంది. రైలుపేటలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. బాలిక ఇంటి సమీపంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న జోజి బాబు(45) ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు టూ టౌన్ పోలీసులు. రైలు పేటలోని బాలిక ఇంటి వద్ద గుడివాడ డీఎస్పీ అబ్దుల్ సుబాన్ స్వయంగా విచారణ చేపట్టారు. కామాంధుడిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం.
Updated Date - Jan 05 , 2025 | 01:36 PM