Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్
ABN, Publish Date - Mar 17 , 2025 | 11:42 AM
Pawan Kalyan on NREGS: జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిని బయటపెట్టారు పవన్ కళ్యాణ్. ఈ పథకంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అమరావతి, మార్చి 17: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalayn) సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయ్యిందని సభ్యులు అన్నారని.. అది గత ప్రభుత్వంలో జరగిందని ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. మొదట దృష్టి పెట్టింది ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపైనే అని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు.
అయినా కూడా సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించి ఆయనను తప్పించినట్లు తెలిపారు. రాష్ట్ర స్ధాయి ప్లైయింగ్ స్వ్కాడ్‌లతో మస్తర్ జాబితాలు సరిగా ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తన్నామన్నారు. రూ.250 కోట్ల అవినీతి జాతీయ ఉపాధి హామీలో జరిగిందని తెలిపారు. సాక్షాధారాలు లేక కేవలం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 75 లక్షలు రికవరీ చేశామని.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 31 మందిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పనులు చేయకుండానే చేసినట్లు రాసుకున్నారన్నారు. జాతీయ ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
సభ్యుల ప్రశ్నలివే..
గత అయిదేళ్లుగా ఎన్ఆర్ఈజీఎస్‌ను వైసీపీ ఆదాయ మార్గంగా మార్చుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులు మరలా మరలా చూపించి... కూలీలుగా రాని వారిని కూలీలుగా చూపించి డబ్బులు తీనేశారని ఆరోపించారు. ఆదోనిలో సాక్షి విలేఖరి బందువులను మస్తర్‌లో రాసి వారికి పనికి రాకుండా బిల్లు చెల్లించారని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఇతర పార్టీల వారికి మస్తర్ ఇవ్వమని చెప్పారన్నారు. రాజకీయ ఉపాధి హమీ పథకమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పథకం కాదు అనేలా మార్చేశారన్నారు. 70 రోజులు అయినా కూలీలకు ఎందుకు డబ్బులు పడడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌ల అవినీతి వివరాలు తమ కార్యాలయానికి పంపాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనిసరావు అన్నారు. వీరిపై చర్యలకు ఆదేశించాలని కోరుతున్నామన్నారు.
ఇవి కూడా చదవండి...
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 17 , 2025 | 11:55 AM