Chandrababu lokesh React: పవన్ కుమారుడికి ప్రమాదంపై చంద్రబాబు, లోకేష్ స్పందన
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:19 PM
Chandrababu lokesh React: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ స్పందించారు.

అమరావతి, ఏప్రిల్ 8: సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Deputy CM Pawan Kalyan Son Mark Shankar) గాయపడడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు పోస్ట్ చేశారు. అలాగే మంత్రి లోకేష్ (Minister Lokesh) కూడా పవన్ కుమారుడికి జరిగిన ప్రమాదంపై స్పందించారు. మార్క్ శంకర్‌కు గాయాలు కావడం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
బాబు ట్వీట్ ఇదే
‘సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
లోకేష్ ఏమన్నారంటే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుకుంటున్న సింగ్‌పూర్‌లోని స్కూల్‌లో అగ్నిప్రమాదం ఘటన విని షాక్‌కు గురయ్యానన్నారు. మార్క్ శంకర్‌కు గాయాలు కావడం బాధాకరమన్నారు. మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో పవన్ కుటుంబానికి ధైర్యం చేక్చూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
ఇదీ జరిగింది
కాగా... పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చదువుకుంటున్నాడు. అయితే శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో చిన్నారి చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం మార్క్ శంకర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అయితే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌కు కుమారుడికి జరిగిన ప్రమాద విషయం తెలిసింది. పర్యటన నిలిపి వేసి సింగపూర్ వెళ్లాలని పవన్‌కు అధికారులు, నాయకులు సూచించారు. కానీ ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాను’ అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని విశాఖ చేరుకోనున్న పవన్.. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి
WhatsApp New Update: కొత్త ఫీచర్.. మీరు పంపిన ఫొటోలు, వీడియోలు ఇకపై సేవ్ అవ్వవు..
Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Read Latest AP News and Telugu News