KV Rao: ఈడీ ముందుకు కాకినాడ పోర్ట్ ఓనర్.. విజయసాయిపై ఏం చెప్పనున్నారు
ABN, Publish Date - Jan 08 , 2025 | 04:14 PM
Andhrapradesh: కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌కు సంబంధించిన షేర్లు బలవంతంగా లాక్కున్నారని గతంలో కేవీ రావు ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా విక్రాంత్ రెడ్డితో పాటు శరత్‌చంద్రా రెడ్డి, విజయసాయి రెడ్డిపై ఆరోపణలు చేసింది. ఈ ముగ్గురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగానే సీఐడీ అధికారులు విజయసాయికి నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్/అమరావతి, జనవరి 8: కాకినాడ పోర్ట్ యాజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (Kakinada port owner kv rao) .. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టులో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారని వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కేవీ రావు ఫిర్యాదుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy), విక్రాంత్ రెడ్డిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఈనెల 6న ఈడీ ఎదుట వైసీపీ నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. అయితే కేవీ రావు ఎవరో తనకు తెలియదని ఈడీ ఎదుట విజయసాయిరెడ్డి సమాధానం ఇచ్చారు. అవసరమైతే కేవీ రావుతో కలిపి తనను విచారించాలని ఈడీని విజయసాయి కోరారు. ఈ క్రమంలో కర్నాటి వెంకటేశ్వర రావు నుంచి స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.
కాగా.. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌కు సంబంధించిన షేర్లు బలవంతంగా లాక్కున్నారని గతంలో కేవీ రావు ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా విక్రాంత్ రెడ్డితో పాటు శరత్‌చంద్రా రెడ్డి, విజయసాయి రెడ్డిపై ఆరోపణలు చేసింది. ఈ ముగ్గురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగానే సీఐడీ అధికారులు విజయసాయికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల 6న ఈడీ ముందు విచారణకు వైసీపీ ఎంపీ హాజరయ్యారు. విచారణలో కేవీ రావు ఎవరో తనకు తెలియదని ఈడీ అధికారులకు విజయసాయి చెప్పారు. సుమారు ఏడు గంటల పాటు విజయసాయిని విచారించిన ఈడీ అధికారులు... దాదాపు 25 ప్రశ్నలను ఆయన ముందు ఉంచారు. కేవీరావుకు తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని.. ఆయన ఎవరో తనకు తెలియదని విజయసాయి రెడ్డి చెప్పారు.
కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ..? హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
కానీ కేవీ రావు చేసిన ఫిర్యాదులో మాత్రం పలు కీలక అంశాలు పేర్కొన్నారు. 2020లో తనకు విక్రాంత్ రెడ్డితో కలవమని విజయసాయి ఫోన్ చేశారని... ఆయనతో భేటీ అవమని చెప్పారని కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేల కోట్లు విలువ చేసే షేర్లను భయబ్రాంతులకు గురి చేసి మరీ అతితక్కువ ధరకే కొలుగోలు చేశారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి విచారణ ముగిసిన తర్వాత కేవీరావు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారుల సమాచారం మేరకు కేవీ రావు.. అధికారుల ముందు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ ముందు ఉంచనున్నారు కేవీ రావు. కాకినాడ సీ పోర్టుకు సంబంధించి రూ.2500 కోట్లు విలువ చేసే షేర్లను కేవలం రూ.494 కోట్లకే బలవంతంగా విజయసాయి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి లాక్కున్నారని కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కాకినాడ సెజ్‌కు సంబంధించి రూ.1106 విలువ చేసే షేర్లను కేవలం రూ.12 కోట్లకు మాత్రమే లాగేసుకున్నారని గతంలోనే కేవీరావు ఫిర్యాదు చేశారు. విజయసాయి సూచన మేరకే విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రా రెడ్డి పలుమార్లు బెదిరించారని కర్నాటి వెంకటేశ్వరరావు తెలిపారు. తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారనే దానిపై పూర్తిస్థాయి వివరాలను కేవీ రావు ఈడీ ముందు ఉంచనున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి...
విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. అసాధారణ ట్యాలెంట్..
Read Latest AP News And Telugu news
Updated Date - Jan 08 , 2025 | 04:16 PM