Krishna district scam: ఏకంగా కార్మికుల సొమ్ముకే ఎసురుపెట్టేశారుగా
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:30 PM
Krishna district scam: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా కార్మికులకు సొమ్ముకే ఎసరుపెట్టేశారు. ఈ స్కామ్ విషయం తెలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా ఆశ్చర్యపోయారు.

కృష్ణా జిల్లా, మార్చి 14: కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ మున్సిపల్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సొసైటీ కమిటీ, బ్యాంక్ అధికారులు కలిసి కుమ్మక్కై దాదాపు రూ.9 కోట్ల మేర కార్మికుల సొమ్మును గోల్మాల్ చేశారు. కార్మికుడు వడ్డాది భాస్కరరావు అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం మరణించాడు. అయితే అతడి పేరు మీద 2022లో సొసైటీ కమిటీ పది లక్షలు రుణం తీసుకుంది. వైసీపీ నాయకుల అండతో కోట్లాది రూపాయలు సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మీ మింగేసిన పరిస్థితి. దీనిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (MLA Venigandla Ramu) స్పందిస్తూ.. సొసైటీలో జరిగిన అవకతవకలను మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) దృష్టికి తీసుకెళ్తానని.. సీఐడీ (CID) ఎంక్వయిరీ కోరతానని తెలిపారు.
కాగా.. దాదాపు 56 మంది కార్మికుల వేతనాల కటింగ్‌తో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మొత్తం 93 మంది సభ్యులతో కోపరేటివ్ సొసైటీ నడుస్తోంది. కార్మికుల సంతకాలు ఫోర్జరీ చేసి ఒక్కొక్కరి పేర్లపై కృష్ణ కో ఆపరేటివ్ బ్యాంకులో ఐదు నుంచి పది లక్షల వరకు సొసైటీ కమిటీ రుణాలు తీసుకున్నట్లు బయటపడింది. రుణాలకు సంబంధించి కార్మికుల వేతనాల్లో కోతలుపడ్డాయి. ఇదేంటా అని కార్మికులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తాము రుణాలు తీసుకోకపోయినా తమ జీతాల్లో కోతలు పడ్డాయంటూ కార్మికులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని, సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..
అంతే కాకుండా ఈ కుంభకోణాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టికి కార్మిక సంఘాల నాయకులు తీసుకొచ్చారు. అవినీతి కుంభకోణంపై ఎమ్మెల్యే కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. సొసైటీ కార్యాలయానికి వచ్చి గుమస్తా రాజుతో ఎమ్మెల్యే మాట్లాడారు. రికార్డులు భద్రపరచాలంటూ పోలీసులకు సూచించారు. తాను 30 లక్షల వరకు వాడుకున్నట్లు గుమస్తా ఒప్పుకున్నాడు. మిగిలిన సభ్యుల సొమ్మంతా సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మీ వాడుకుందని గుమస్తా రాజు తెలిపాడు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే దిక్కు అని సొసైటీ సభ్యులు వాపోతున్నారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 14 , 2025 | 03:53 PM