ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DK Aruna: సీఎం చంద్రబాబుపై డీకే అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jan 03 , 2025 | 02:50 PM

Andhrapradesh: పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయిన తరువాత దుర్గమ్మ దర్శనానికి రావాలని అనుకున్నామని.. మధ్యలో వరదలు వచ్చాయని.. అందుకే కొంత ఆలస్యం అయ్యిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. అమ్మవారు విజయానికి ప్రతీక అని.. తనకు మంచి విజయం అందించారన్నారు. అమ్మవారి ఆశీర్వాదం తెలుగు ప్రజలు అందరికీ వుండాలి అని కోరుకున్నట్లు తెలిపారు.

MP DK Aruna

విజయవాడ, జనవరి 3: విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి రావటం ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ‌ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (BJP MP DK Aruna) అన్నారు. కుటుంబ సమేతంగా వచ్చామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయిన తరువాత రావాలి అనుకున్నామని.. మధ్యలో వరదలు వచ్చాయని.. అందుకే కొంత ఆలస్యం అయ్యిందని అన్నారు. అమ్మవారు విజయానికి ప్రతీక అని.. తనకు మంచి విజయం అందించారన్నారు. అమ్మవారి ఆశీర్వాదం తెలుగు ప్రజలు అందరికీ వుండాలి అని కోరుకున్నట్లు తెలిపారు. గతం కంటే ఇప్పుడు ఆలయం చాలా అభివృద్ధి చెందిందన్నారు. దర్శనం చాలా చక్కగా జరిగిందన్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు రాష్ట్రం విడిపోయినప్పటికి అందరికీ మంచి జరగాలి అని కోరుకున్నానన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎంగా ఉండి మంచి అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఎన్డీఏలో ఉన్న సీఎం.. ఈ ప్రాంతం ఎమ్మెల్యే సుజన చౌదరి మంచి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు.


కాగా.. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన ఎంపీకి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు ఎంపీ. ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని. అమ్మవారి చిత్రపటాన్ని ఎంపీ డీకే అరుణకు ఆలయ ఇన్‌చార్జ్ ఈవో రామచంద్ర మోహన్ అందజేశారు.


ఇవి కూడా చదవండి...

వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. వేగం తెలిస్తే షాక్..

రికార్డు అమ్మకాలు.. ఒక్కరోజే రూ.9 కోట్ల మద్యం తాగేశారు

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 03 , 2025 | 02:56 PM