ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Parthasarathy: రైతులను నిండా ముంచిన జగన్ ఇప్పుడు మతి చెలించి మాట్లాడుతున్నారు..

ABN, Publish Date - Jan 13 , 2025 | 05:42 PM

మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జగన్ మాటలు వింటుంటే మతి చెలించి మాట్లాడుతున్నారనే అనుమానం కలుగుతోందని మంత్రి మండిపడ్డారు.

Minister Kolusu Parthasarathy

విజయవాడ: మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జగన్ మాటలు వింటుంటే మతి చెలించి మాట్లాడుతున్నారనే అనుమానం కలుగుతోందని మంత్రి మండిపడ్డారు. జగన్ పని తీరు, వ్యవహారశైలి నచ్చక అనేక మంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారని, అయినా ఆయన మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ పార్టీ అధినేత పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయాయని, ఆ విషయం ఆయన మాటల ద్వారా అర్థమవుతోందని పార్థసారథి చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారని, ధాన్యం సేకరణ విషయంలో జగన్ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో రైతులకు తెలుసని మంత్రి విమర్శించారు. బిందు సేద్యం, పామాయిల్, మామిడి, ధాన్యానికి మద్దతు ధర వంటి వాటితో అన్నదాతలు సంతోషంగా ఉన్నారని, రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని తెలిపారు. అందుకే ఈ సంక్రాంతికి గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత సంతోషంగా అన్నదాతలు ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పుకొచ్చారు.


ఆనందంగా సంక్రాంతి..

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. "రైతుల నుంచి దాదాపు 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 24 గంటల్లోనే వారికి డబ్బులు చెల్లించాం. అందుకే రైతులు నేడు చాలా సంతోషంగా సంక్రాంతి పండగ నిర్వహించుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసిన మోసాలను రైతులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ధాన్యం సేకరించి జగన్ ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే మా ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించింది. ధాన్యం సేకరణలో వైసీపీ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేసింది. వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా రద్దు చేసిన అనేక కార్యక్రమాలను పునరుద్ధరించాం. ప్రతినెలా ఒకటో తేదీ నాటికి పెంచిన పెన్షన్లతో ఇళ్లకు వెళ్లి అందిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రతి కుటుంబానికీ రూ.12 వేలు తల్లికి వందనం పేరుతో ఇవ్వబోతున్నాం. సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మా భూమి మాదే అనే ధైర్యం ప్రజలకు కల్పించాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల పొట్ట నింపే కార్యక్రమం సీఎం చేపట్టారు.


వైసీపీ పాలనలో అధోగతి..

వైసీపీ హయాంలో సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వెళ్లలేమని ఏపీ ప్రజలు బాధపడేవారు. నేడు ఊరూరా రోడ్లు వేయడంతో సొంతూళ్లకు ఆనందంగా వెళ్లారు. ఏపీలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సంక్రాంతి పండగను సంబరంగా చేసుకుంటున్నారు. పారిశ్రామికంగా ఈ రాష్ట్రం వైసీపీ పాలనలో అధోగతి పాలైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేశ్ విదేశీ పర్యటనలు చేపట్టి పెట్టుబడులను తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఓ పరిశ్రమ పెట్టాలంటే తమకేంటని పాలకులు దోచుకున్నారు. 2018-19లో డేటా సెంటర్‪కు 130 ఎకరాలు కేటాయిస్తే వైసీపీ పాలనలో అసలు పట్టించుకోలేదు. రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వలసలు వెళ్లారు. వచ్చే రెండేళ్లల్లో రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి.


లోకేశ్ వల్లే..

చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలంతా పండగ చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఏపీ గాడిన పడిందని, అభివృద్ధి జరుగుతోందని ప్రజలు నమ్ముతున్నారు. వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారు. జగనన్న కాలనీలకు PMAY- ఎన్టీఆర్ నగర్ పేరు సబబేనని భావిస్తున్నాం. జగన్ ఇప్పుడు కూడా నేర ప్రవృత్తితో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ తీరు మార్చుకోకుంటే ప్రజలు ఈసారి మరింత బలంగా బుద్ది చెబుతారు. మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం. జగన్ పగటి కలలు కంటున్నారా?.. రాత్రి కలలు కంటున్నారా?.. లేక రాజకీయ పరిస్థితులకు మైండ్ చలించి మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది. వైనాట్ 175 అన్న నినాదం ఏమైందో ప్రజలు ఎలా బుద్ది చెప్పారో అందరికీ తెలుసు. వైసీపీ నేతల గాలి మాటలను పట్టించుకోమని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

AP News: ఎక్కడున్నా వదిలిపెట్టను.. డిఎస్పీని బెదిరించిన జగన్..!

AP News: ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు..

Updated Date - Jan 13 , 2025 | 05:43 PM