Minister Lokesh: విద్యార్థుల కోసం ఆ జీవో తెస్తాం: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన..
ABN, Publish Date - Jan 07 , 2025 | 08:16 PM
ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) తెలిపారు. అమరావతే రాజధానిగా ఉంటూ అభివృద్ధి మాత్రం రాష్ట్రం మెుత్తం చేయాలన్నదే ఏపీ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) తెలిపారు. అమరావతే రాజధానిగా ఉంటూ అభివృద్ధి మాత్రం రాష్ట్రం మెుత్తం చేయాలన్నదే ఏపీ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. విజయవాడ (Vijayawada) లబ్బీపేటలో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 (Polytech Fest 2024-25)లో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన 24 స్టాళ్లను ఆయన సందర్శించారు. స్టాళ్లు పెట్టిన విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. వినూత్న ప్రయోగాలు చేసిన విద్యార్థులను అభినందించి పలు సూచనలు చేశారు. గెలిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
APSRTC: గుడ్ న్యూస్.. సంక్రాంతి వేళ ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే..
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. "రాజధాని ఒకే దగ్గర ఉండి అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని చోట్లా జరగాలన్నదే ప్రభుత్వ విధానం. అనంతపురం ఆటోమొబైల్ హబ్ గానూ, కర్నూల్ డ్రోన్ హబ్‌గా, కడప, చిత్తూరు జిల్లాలను ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్షరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ప్రకాశం జిల్లాలో బయోఫీల్డ్స్ అభివృద్ధి చేస్తున్నాం. విద్యా శాఖలో సంస్కరణలు తీసుకురావడం సవాల్‌గా తీసుకుని బాధ్యతలు స్వీకరించా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రతీ నగరంలో విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు తీసుకుంటాం.
Visakha: ఏపీపై వరాల జల్లు.. రేపే ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
విద్యార్థులు పైలెట్ ప్రాజెక్టులు చేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అనుగుణంగా పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు తెస్తాం. పాలిటెక్ ఫెస్ట్-2018 చంద్రబాబు ఆలోచనల్లో నుంచి వచ్చిన కార్యక్రమం. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో విద్యార్థుల ప్రతిభ అపారం. 1,256 ప్రాజెక్టుల్లో 200 పైచిలుకు రాష్ట్రస్థాయికి తీసుకువచ్చారు. ఏపీ ప్రభుత్వ శాఖల్లో పైలట్ ప్రాజెక్టులు చేసేలా విద్యార్థుల కోసం జీవో తెస్తాం. ఈ టెక్ ఫెస్ట్ ఇక్కడితో ఆగకూడదని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Andhra Pradesh: దారుణం.. ప్రియురాలి తండ్రి కళ్ళల్లో కారం కొట్టి మరీ..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. సుప్రీం కీలక తీర్పు
Updated Date - Jan 07 , 2025 | 08:18 PM