Share News

బోట్లను సముద్రం ఒడ్డున నిలుపుదల చేయండి

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:50 AM

నాగాయలంక సముద్రంలో యాంత్రిక పడవల ద్వారా జాలరుల చేపల వేటలపై ఈనెల 15 నుంచి జూన్‌ 14వరకు ప్రభుత్వం నిషేధం విధించిందని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సునీత తెలిపారు.

బోట్లను సముద్రం ఒడ్డున నిలుపుదల చేయండి

జాలరులకు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సునీత ఆదేశం

నాగాయలంక, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలో 10 లాండింగ్‌ సెంటర్ల పరిధిలో 950 మోటారు బోట్లు ఉన్నాయని, జాలరులు తమ బోట్లను ఒడ్డుకు తీసుకొచ్చి నిలుపుదల చేయాలని అవనిగడ్డ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి టి.సునీత ఆదేశించారు. నాగాయలంక సముద్రంలో యాంత్రిక పడవల ద్వారా జాలరుల చేపల వేటలపై ఈనెల 15 నుంచి జూన్‌ 14వరకు ప్రభుత్వం నిషేధం విధించిందని ఆమె తెలిపారు. ఈ 61 రోజుల కాలంలో సముద్రంలో చేపలు, రొయ్యలు పునరుత్పత్తి చేస్తాయని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి వేట చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Updated Date - Apr 13 , 2025 | 12:50 AM