Share News

Pawan Kalyan: దేవుని ఆస్తి దోచుకోవడం దేశ ద్రోహం కంటే ఎక్కువ..

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:09 PM

వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం శుభపరిణామమని, పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ ప్రతిబింబిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ బిల్లును లోక్‌సభలో దాదాపు 12 గంటలు, అలాగే రాజ్యసభలో దాదాపు 14 గంటలు పూర్తిగా చర్చలు జరిగాయని.. ఈ బిల్లుపై ఏకపక్ష నిర్ణయం కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించారని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు.

Pawan Kalyan: దేవుని ఆస్తి దోచుకోవడం దేశ ద్రోహం కంటే ఎక్కువ..
AP Deputy CM Pawan Kalan

అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) పార్లమెంటు (Parliament) ఉభయ సభల ద్వారా ఆమోదం పొందడం కేవలం పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ ప్రతిబింబిస్తోందని ఇది న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం వైపు ఒక చారిత్రాత్మక అడుగు అని ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalan) ట్విట్టర్ (Twitter) వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దార్శనిక నాయకత్వంలో.. ఎన్డీయే (NDA) పరిపాలన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తన నిబద్ధతను మరోసారి నిరూపించుకుందన్నారు. సంవత్సరాలుగా, వక్ఫ్ బోర్డుల కార్యకలాపాల గురించి తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయన్నారు. వక్ఫ్ బోర్డు (Waqf Board) సవాళ్లను పరిష్కరించడం, పారదర్శకతను పెంచడం, వక్ఫ్ ప్రయోజనాలు పేద ముస్లింలకు చేరేలా చూడటం, ముస్లిం మహిళలకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం వైపు ఈ సవరణ ఒక ముఖ్యమైన అడుగు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Also Read..: కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం


ఈ బిల్లుపై ఏకపక్ష నిర్ణయం కాకుండా, ఈ బిల్లును లోక్‌సభలో దాదాపు 12 గంటలు, అలాగే రాజ్యసభలో దాదాపు 14 గంటలు పూర్తిగా చర్చలు జరిగాయని, ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించారని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఇలా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టడంలో.. మార్గనిర్దేశం చేయడంలో నాయకత్వం వహించినందుకు పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల సంక్షేమ మంత్రి కిరణ్ రిజిజు, హోం మంత్రి అమిత్ షా.. రాజ్యసభలో ఎన్డీయే నాయకుడు జేపీ నడ్డాలకు తాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సంస్కరణకు మద్దతు ఇచ్చిన ప్రతి ఎంపీకి, అలాగే వారి మద్దతుకు ముస్లిం సమాజానికి కూడా తాను కృతజ్ఞతలు తెలియజేసినట్లు చెప్పారు.


తాను 2008-2009 చట్టం చెప్పినట్లుగా, దేవుని ఆస్తి దోచుకోవడం కేవలం దేశ ద్రోహం కంటే ఎక్కువని.. ఇది దేవుడికి ద్రోహమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కొత్త 'UMEED' చట్టం కేవలం చట్టం కంటే ఎక్కువని.. ఇది ఒక నైతిక వైఖరి అని అన్నారు. ఇది పవిత్ర ఆస్తులను రక్షించడం, వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడం, న్యాయమని, న్యాయానికి ఎన్డీయే ప్రభుత్వం నిబద్ధతను ప్రదర్శించడం గొప్ప విషయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


కాగా వక్ఫ్‌ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం అర్ధరాత్రి దాటాక సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లును బుధవారం అర్ధరాత్రి దాటాక లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో 288–232 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది. వక్ఫ్‌ సవరణ బిల్లు(యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎంఈఈడీ–ఉమీద్‌)’కు లోక్‌సభ ఆమోదం తెలపడంతో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్‌ సవరణ బిల్లును చట్టవిరుద్ధమైనదిగా పేర్కొన్న ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లులో ముస్లిమేతరుల ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. ముస్లింల హక్కులను హరిస్తామన్న ప్రతిపక్షాల ఆరోపణలనూ ఖండించారు. ముస్లింల్లోని అన్ని తెగల వారి హక్కులను పరిరక్షించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ బిల్లుతో వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ‘‘బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు మేం రాష్ట్ర ప్రభుత్వాలు, మైనారిటీ కమిషన్లు, వక్ఫ్‌ బోర్డులతో సంప్రదింపులు జరిపాం. బిల్లు పరిశీలనకు జేపీసీని ఏర్పాటు చేశాం. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది’’ అని రిజిజు చెప్పారు. ప్రస్తుతం దేశంలో 8.72 లక్షల వక్ఫ్‌ ఆస్తు లు ఉన్నాయన్నారు. 2006లో 4.9 లక్షల వక్ఫ్‌ ఆస్తు ల ద్వారా రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తుందని సచార్‌ కమిటీ అంచనా వేసిందని, అంటే ప్రస్తుతం ఆయా ఆస్తుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఊహించుకోవచ్చని తెలిపారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల నిర్వహణలో లోపాలను, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే ఈ సవరణ బిల్లును తెచ్చినట్లు చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, వక్ఫ్‌ ఆస్తులన్నీ ముస్లింలకు మాత్రమే చెందుతాయని స్పష్టంచేశారు. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా 284 సంస్థలు తమ అభిప్రాయాలను తెలిపాయని, కోటి మందికి పైగా ప్రజలు వినతిపత్రాలు అందించారని వెల్లడించారు. అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే మైనారిటీ వ్యవహారాల శాఖ ఈ సవరణ బిల్లును రూపొందించిందని రిజిజు స్పష్టం చేశారు. సభ్యులందరూ బిల్లుకు మద్దతు తెలుపుతారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యుడు సయ్యద్‌ నజీర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టి, మతపరమైన ఏకీకరణ కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అబద్ధాల ఆధారం గా సవరణ బిల్లును రూపొందించారని, ఆరు నెలలుగా బీజేపీ వక్ఫ్‌ బిల్లుపై దుష్ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయకుమార్ సంచలన వ్యాఖ్యలు..

Electric Shockతో ఇద్దరు ఉద్యోగులు మృతి..

తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎల కొలువు అయ్యారంటే..

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 01:09 PM