ఈ-శ్రమ పోర్టల్‌లో అసంఘటిత కార్మికుల నమోదు
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:25 AM
అసంఘటిత కార్మికులు అందరూ ఈ-శ్రమ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, కర్మాగార, బాయిలర్స్, ఇన్సూరెన్సు, మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు తెలిపారు.

ఈ-శ్రమ పోర్టల్‌లో అసంఘటిత కార్మికుల నమోదు
అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు
కలెక్టరేట్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : అసంఘటిత కార్మికులు అందరూ ఈ-శ్రమ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, కర్మాగార, బాయిలర్స్, ఇన్సూరెన్సు, మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం భవానీపురంలోని ఏపీటీడీసీ ధరణి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్సూర్డ్ పర్సన్స్ రిజిస్ర్టేషన్‌పై సూచనలు ఇస్తూ 10 లేదా ఆపైన కార్మికులు పనిచేస్తున్న, నెల జీతం రూ.21 వేల కంటే తక్కువగా వున్న వారిని నమోదు చేయాలని ఆదేశించారు. కార్మిక శాఖ, ఇతర శాఖల సమన్వయంతో ఈ నమోదు ప్రక్రియను రానున్న రెండు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. గిగ్ వర్కర్స్, ప్లాట్‌ఫాం వర్కర్స్‌ను ఈ - శ్రమ పోర్టల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మాడ్యూల్‌లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, వీటిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెలాఖరు లోగా బాల కార్మిక తనిఖీలు విస్తృతంగా నిర్వహించి గుర్తించిన బాల కార్మికులకు చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకోవావాలని, సంబంధిత యజమానులపై చ ట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కార్మిక, కర్మాగారాల, బాయిలర్స్ ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ శాఖల రాష్ట్రస్థాయి, ఏలూరు జోన్, జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.