AP High Court TTD Case: శ్రీనివాస దీక్షితులుకు ఏపీ హైకోర్ట్ షాక్
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:30 PM
AP High Court TTD Case: పెద్దింటి కుటుంబానికి చెందిన శ్రీనివాస దీక్షితులుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పరిపాలన పరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది న్యాయస్థానం.

తిరుమల, ఏప్రిల్ 4: తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumal Tirupati Devasthanam) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తనను తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా బదిలీ చెయ్యాలంటూ పెద్దింటి కుటుంబానికి చెందిన శ్రీనివాస దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరుగగా.. శ్రీనివాస దీక్షితుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పరిపాలన పరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్ఫష్టం చేసింది. ఉద్యోగిగా టీటీడీ ఎక్కడ విధులు కేటాయిస్తే అక్కడ విధులు నిర్వర్తించాలని పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
Ancient temples: భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాల గురించి తెలుసా.
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News