Share News

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

ABN , Publish Date - Feb 07 , 2025 | 08:18 PM

ఆంధ్రప్రదేశ్: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధిస్తున్నాడంటూ టీడీపీ కార్యకర్త డేవిడ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
MLA Kolikapudi Srinivasa Rao

అమరావతి: తిరువూరు(Tiruvuru) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (MLA Kolikapudi Srinivasa Rao) మరో వివాదంలో చిక్కుకున్నారు. కొలికపూడి వేధింపులు తాళలేక డేవిడ్ అనే టీడీపీ కార్యకర్త (TDP worker David) ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కోసం కష్టపడిన తనని అక్రమ కేసులతో ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ బాధితుడు నిన్న (గురువారం) ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనను ఏ విధంగా ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తున్నారో చెబుతూ వీడియో రికార్డు చేసిన అనంతరం పురుగులమందు తాగాడు.


గమనించిన కుటుంబసభ్యులు డేవిడ్‌ను చికిత్సనిమిత్తం హుటాహుటిన విజయవాడకు తరలించారు. అయితే బాధితుడి సెల్ఫీ వీడియో బయటకు రాకుండా కొలికపూడి గురువారం రోజున అందరినీ బెదిరించాడంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికే వరస వివాదాలతో అధిష్ఠానానికి కంటిలో నలుసుగా కొలికపూడి తీరు మారింది. కాగా, గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడిపై టీటీపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. టీటీడీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా ఎమ్మెల్యే తీరులో మాత్రం మార్పు రాలేదు.


గతేదాడి ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం ఎమ్మెల్యే కొలికపూడి ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి వెళ్లారు. ఇద్దరి అన్నదమ్ముల స్థల వివాదంలో తలదూర్చిన ఆయన.. భూక్యా కృష్ణ, చంటి దంపతులపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను హుటాహుటిన విజయవాడకు తరలించారు. అలాగే తన సొంత నిధులతో కాలువలు తవ్వించానని, కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేకుండా పోయిందంటూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరస ఘటనలతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేపై తీరుపై అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశాలిచ్చారు. కాగా, ప్రస్తుతం ఆయన మరో వివాదంలో చిక్కుకోవడంతో టీటీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేడి చూడాల్సిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

Kakinada: వెలుగులోకి వచ్చిన మరో కీచక టీచర్ ఉదంతం.. విద్యార్థినిలను ఏం చేశాడంటే..

Prakasam: ఫొటో మార్ఫింగ్ కేసు.. రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇవే..

Updated Date - Feb 07 , 2025 | 08:19 PM