Share News

Vamsi Case: వంశీకి షాక్.. 17 వరకు రిమాండ్

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:51 PM

Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులకు సంబంధించి విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ప్రధాన మూడు అంశాలకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగాయి.

Vamsi Case: వంశీకి షాక్.. 17 వరకు రిమాండ్
Former MLA Vallabhaneni Vamshi

విజయవాడ, మార్చి 3: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ అధికారులు (CID Officers) కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనిపై వర్చువల్‌గా వల్లభనేని వంశీని (Former MLA Vallabhaneni Vamsi) విచారించింది న్యాయస్థానం. ఈ నెల 17 వరకు మాజీ ఎమ్మెల్యేకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. కాగా.. వంశీకి సంబంధించి కేసులపై ఈరోజు (సోమవారం) విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా మూడు అంశాలపై వంశీ నాయవాదులు, ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు.


బ్యారక్‌ మార్చాలంటూ వంశీ కోర్టులో పిటిషన్ వేయగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. అయితే గతంలోనే దీనిపై విచారణ జరగాల్సి ఉండగా మూడు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో ఈ పిటిషన్‌ను సీఐడీ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తిరిగి సీఐడీ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈరోజు వర్చువల్‌గా వంశీని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయాధికారి ఈనెల 17 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు చేశారు.

ఘోరం.. కాకినాడలో పార్శిల్ బ్లాస్ట్


అలాగే వంశీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. అయితే విచారణలో వంశీ సరైన సమాధానాలు చెప్పలేదని, సమాధానాలు దాట వేసిన నేపథ్యంలో ఆయన నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఏ4 వీరరాజు, వంశీని మరో పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా కోర్టు వాదనలు జరిగాయి. అయితే ఈ పిటిషన్‌పై నేడు లేదు రేపు కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 03 , 2025 | 04:52 PM