మల్లన్న సేవలో ఏపీ చీఫ్ విప్
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:27 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ ఆంజనేయులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఘన స్వాగతం పలికిన ఆలయాధికారులు
కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకపూజలు
శ్రీశైలం,ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి)ః శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ ఆంజనేయులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి రాజగోపురం వద్ద దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయులు కుటుంబ సభ్యులతో శ్రీమల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాం బదేవికి కుంకుమార్చన, ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదండితులు, అర్చకులు వారిని ఆశీర్వదించారు. ఈవో ఎం.శ్రీనావాసరావు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్ర్తాలతో సత్కరించి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.