Share News

కంచి యూనివర్శిటీలో ఉత్తమ విద్యావకాశాలు

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:09 AM

విద్యార్థులకు ఉత్తమ వ్యక్తిత్వంతోపాటు గొప్ప భవిష్యత్తును అందించే దిశగా కంచి యూనివర్శిటీలో అనేక విద్యావకాశాలు ఉన్నాయని కంచి యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

కంచి యూనివర్శిటీలో ఉత్తమ విద్యావకాశాలు
మాట్లాడుతున్న కంచి యూనివర్సిటీ వీసీ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్‌

వీసీ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్‌

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఉత్తమ వ్యక్తిత్వంతోపాటు గొప్ప భవిష్యత్తును అందించే దిశగా కంచి యూనివర్శిటీలో అనేక విద్యావకాశాలు ఉన్నాయని కంచి యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం పాత నగరంలోని శంకరమందిరం ఎదురుగా ఉన్న కరివేన బ్రాహ్మణ నిత్యాన్న సత్రం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్శిటీ అందజేస్తున్న కోర్సులు, వాటి ఫీజుల వివరాలు, విద్యావకాశాలు, ఉపకారవేతనాలు తదితర అంశాలను వారు వివరించారు. తమిళనాడు రాష్ట్రంలోని కంచిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం (కంచి యూనివర్సిటీ)లో స్పాట్‌ అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. వివరాలకు అడ్మిన్‌ నాగేశ్వరరావు సెల్‌ నెం. 96550 35217లో సంప్రదించాలని సూచించారు.

Updated Date - Apr 14 , 2025 | 12:09 AM