Share News

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:05 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో సంద డిగా మారింది.

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు
శ్రీమఠం ప్రాంగణంలో రద్దీగా ఉన్న భక్తులు

మంత్రాలయం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో సంద డిగా మారింది. రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాలు కావటం తో దక్షిణాది రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహా ముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహాలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాల మ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీస్సులు పొందారు.

Updated Date - Apr 13 , 2025 | 01:05 AM