Share News

మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:41 AM

నందికొట్కూరు మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకరవ్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి చైర్మన్‌ వీరం ప్రసాదరెడ్డికి సూచించారు.

 మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కృషి చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయసూర్య, మాండ్ర శివానందరెడ్డి

నందికొట్కూరు రూరల్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకరవ్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి చైర్మన్‌ వీరం ప్రసాదరెడ్డికి సూచించారు. అల్లూరు గ్రామంలో శనివారం విలేకరుల ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ప్రసాదరెడ్డికి చైర్మన్‌ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

చైర్మన్‌ పదవికి న్యాయం చేస్తా

చైర్మన్‌ పదవికి న్యాయం చేస్తానని నందికొట్కూరు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌గా ఎన్నికైన వీరం ప్రసాదరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ అఽధినాయకత్వం, ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానన్నారు. నాయకులు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ అలగనూరు సుధాకర్‌, కౌన్సిలర్‌ జాకీర్‌, కౌన్సిలర్‌ భాస్కరెడ్డి, బిజినవేముల సర్పంచ్‌ రవియాదవ్‌, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:41 AM