వక్ఫ్ సవరణ రద్దుకు పోరాడాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:02 AM
బీజేపీ ప్రభుత్వం ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా వక్ఫ్‌బోర్డు బిల్లు సవరణ తీసుకువచ్చిందని, బిల్లు రద్దుకై పోరుకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పిలుపునిచ్చారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య
పత్తికొండ టౌన్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రభుత్వం ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా వక్ఫ్‌బోర్డు బిల్లు సవరణ తీసుకువచ్చిందని, బిల్లు రద్దుకై పోరుకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పిలుపునిచ్చారు. సోమవారం షాధీఖానాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అధికార మదంతో బీజేపీ ఆఘమేఘాల మీద పార్లమెంటులో వక్ఫ్‌బోర్డు బిల్లును పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వామపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, ముస్లిం సంఘాలు ఆందోళనలు పట్టించు కోవడం లేదని, రద్దు చేసే వరకు పోరాటాలు ఆగవని హెచ్చరించారు. సీపీఐ, సీపీఎం నాయకులు ఇబ్రహీం, నబీరసూల్, వెంకటేశ్వరరెడ్డి, రామాంజనేయులు, జామియామసీదు కమిటీ సభ్యులు హుశేన్, బషీర్ బాషా, కొత్తపేట సభ్యులు హోసూరు బాషా, నూర్‌బాషా, గుండుబాషా, ఆల్తాఫ్, తదితరులు పాల్గొన్నారు.