క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:29 AM
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

పాణ్యం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నెరవాడలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. తల్లిదండ్రులు క్రీడల పట్ల తమ పిల్లలకు ప్రోత్సాహం అందించాలన్నారు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. అనంతరం ఆమె పిన్నాపురం లోని ఎద్దుల పందేలను ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ సభ్యులు అమరసింహారెడ్డి, నారాయణరెడ్డి, రమణారెడ్డి, మునీశ్వరరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ జయరామిరెడ్డి, ఎంపీటీసీ రంగరమేష్ తదితరులు పాల్గొన్నారు.