ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: గ్రీన్ కో ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Jan 11 , 2025 | 05:15 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో గ్రీన్ కో ప్రాజెక్టు (Green Co project) కోసం రూ.30 వేల కోట్లు పెట్టుబడులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) తెలిపారు. భారతదేశంలో ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టారని పవన్ వెల్లడించారు.

Deputy CM Pawan Kalyan

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో గ్రీన్ కో ప్రాజెక్టు (Green Co project) కోసం రూ.30 వేల కోట్లు పెట్టుబడులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) తెలిపారు. భారతదేశంలో ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టారని పవన్ వెల్లడించారు. 2021లో కర్నూలులో గ్రోన్ కో ప్రాజెక్టు ప్రారంభం అయ్యిందని, ఈ ప్రాజెక్టు ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, 40 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ఆయన తెలిపారు. కాగా, శనివారం కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో ప్రాజెక్టును పవన్ కల్యాణ్ సందర్శించారు.

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.. కోర్టు కీలక ఉత్తర్వులు


ప్రాజెక్టుకు సంబంధించి 45 హెక్టార్ల భూమి రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదంలో ఉందని, దాన్ని పరిష్కరించేందుకే తాను వచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఆఫీసులో కూర్చుని చూడటం వేరని, ఫీల్డ్‌కి వచ్చి నేరుగా చూడటం వేరని ఉపముఖ్యమంత్రి చెప్పారు. అందుకే తానే స్వయంగా గ్రీనో కో ప్రాజెక్టు చూసేందుకు వచ్చినట్లు పవన్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ రంగం తర్వాత గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నారని, అందుకే వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి చెప్పారు.

TTD: వారి ఇళ్లకు రేపట్నుంచి వెళ్లనున్న టీటీడీ పాలకమండలి సభ్యులు.. ఎందుకంటే..


గాలి, నీరు, సౌర కాంతితో విద్యుత్ తయారు చేయడంలో ప్రపంచంలోనే ఇది మొదటి అతిపెద్ద ప్రాజెక్టని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇదో గొప్ప పర్యాటక ప్రాంతం అవుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ కో ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఏపీలో మూడో వంతు విద్యుత్ అవసరాలను ఈ ప్రాజెక్టు తీర్చగలదని ఆయన చెప్పారు. ప్రాజెక్టు విషయంలో ఏ వివాదం ఉన్నా.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

YS Sharmila: బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన షర్మిల


కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అన్ని జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటవీ భూములు ఎంతమేర అన్యాక్రాంతం అయ్యాయనే దానిపై త్వరలో డ్రైవ్ పెడతామని ఉపముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఎన్ని ఎకరాల భూములు ఆక్రమణలకు గురయ్యాయి, అలాగే ఇంకా ఎంతమేర మిగిలి ఉన్నాయనే విషయాలను డ్రైవ్ ద్వారా పరిశీలిస్తామని చెప్పారు. ఆ తర్వాత తానే నేరుగా ఫీల్డ్‌లోకి దిగనున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి...

TG News: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

CM Revanth: సీఎం రేవంత్ జిల్లాల బాట.. వాటిపై ప్రత్యేక దృష్టి

Updated Date - Jan 11 , 2025 | 05:17 PM